నన్ను నమ్మరులే ..ఆడపిల్లను కదా..సాయి పల్లవి ఎమోషనల్..!!

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఉన్న ఆడపిల్ల. జనరల్ గా హీరోయిన్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఎక్స్ పోజింగ్..బికినీ ట్రీట్..వల్గర్ డ్యాన్స్లు. కానీ హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ రోల్ నే కాదు.. హీరో కి తగ్గటు నటించగలదు అని.. ప్రూవ్ చేసిన నటి ఈ సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల..సినిమాలో తన పాత్ర గురించే ఆలోచిస్తాది తప్పిస్తే..రెమ్యూనరేషన్ గురించి అస్సలు ఆలోచించదు. సినిమా ఫ్లాప్ అయితే, రెమ్యూనరేషన్ ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. నేటి కాలంలో ఇలాంటి హీరోయిన్ మనకి అరుదుగా కనిపిస్తారు.

కాగా, మే 9న ఈ బ్యూటి పుట్టినరోజు. ఆమె బర్తడే సంధర్భగా సాయి పల్ల్వి అంటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసారు మేకర్స్. దీంతో సాయి పల్లవి హవా మళ్ళీ మొదలైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానా హీరో గా నటిస్తున్న విరాట పర్వం లో సాయి పల్లవి వెన్నెల పాత్ర లుక్ ని రిలీజ్ చేశారు. తెర పై మనం మరో కొత్త సాయి పల్లవి చూడచ్చు అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంతేకాదు, ఆమె నటిస్తున్న మరో సినిమా ‘గార్గీ’ నుంచి స్పెషల్ వీడియో ని వదిలారు.

ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. సాయి పల్లవి లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా.. ఇంత బాగా నటించగలదా.. ఓ మై గాడ్ నీ యాక్టింగ్ స్కిల్స్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెతుతున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పుతున్న సాయి పల్లవి వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్. అందులో ఓ డైలాగ్ అభిమానులను బాగా టచ్ చేసింది. “నువ్వు టైమ్, రాత, విధి—- అన్నిటినీ నమ్ముతావమ్మా.—- కానీ, నన్ను మాత్రం నమ్మవు.—- ఎందుకంటే… నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి చెప్పే ఎమోషన్ ల్ డైలాగ్ హైలెట్ గా నిలిచింది. చూస్తుంటే సాయి పల్లవి ఖాతలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular