పవన్-చిరు కాంబినేషన్ మిస్ అవ్వడానికి కారణం ఇదేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయవలసిన సినిమా మరొక హీరో చేయడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పవచ్చు.. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బాగా ఆకట్టుకుంది. చిరంజీవి ని శంకర్ దాదా అనే పాత్రలో డైరెక్టర్ ఎంతో అద్భుతంగా మలిచారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేశారు. ఇక చిరంజీవి తో పాటుగా అంతే స్థానాన్ని సంపాదించుకున్న ATM అనే పాత్ర కూడా ఉన్నది. ఈ సినిమాకి ఇదే హైలెట్ గా మారింది. ఇక ఈ పాత్రలో చిరంజీవి కి సొంత తమ్ముడి గా నటించాడు హీరో శ్రీకాంత్.

ఇందులోని శ్రీకాంత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.. ఇటీవల తాజాగా శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. శ్రీకాంత్ శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రంలో ATM పాత్ర గురించి తెలియజేశాడు. అయితే మొదట ఈ పాత్రకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తో చేద్దామని డైరెక్టర్,చిరంజీవి అనుకున్నారట. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం చేత.. తన డేట్ లు అడ్జెస్ట్ చేయలేక పోవడంతో ఈ సినిమాలో నటించ లేకపోయారట.

దీంతో అనుకోకుండా చిరంజీవి ఇంటికి శ్రీకాంత్ వెళ్లడంతో ఈ పాత్ర చేయమని చిరంజీవి అడగగా అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా అని ఒప్పుకున్నారని శ్రీకాంత్ తెలిపారు. అయితే చిరంజీవి, శ్రీకాంత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం వల్లే ఇలాంటి పాత్రలు బాగా పండాయి అని చెప్పవచ్చు.

Share post:

Popular