సీనియర్ నటి అరుణ: కూతుర్లు పుట్టడం మేము చేసుకున్న శాపమా..?

గతంలో ఎందరో హీరోయిన్ లు సినిమా రంగంలోకి అడుగుపెట్టి రాణించి ప్రేక్షకుల మనసుపై బలమైన ముద్ర వేసుకున్నారు. సీతాకోక చిలుక సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ముచ్చర్ల అరుణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్ గా మారే సమయానికి ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం విశేషం. అరుణ స్వస్థలం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం. అయితే తన విద్యాభ్యాసం అంతా కూడా హైద్రాబాద్ లోనే జరిగింది. అక్కడే ఈమె ఒక మ్యూజిక్ అకాడమీలో డ్యాన్స్ నేర్చుకుంటున్న వేళలో… తమిళ టాప్ డైరెక్టర్ అయిన భారతీరాజా ఆమెను తీక్షణంగా గమనించి తాను తీస్తున్న సీతాకోకచిలుక సినిమాలో ఫిమేల్ లీడ్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాతో ఈమె ఫేమస్ అయిపోయింది. ఇక హీరోయిన్ గా వెనుతిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

అరుణ తన కెరీర్ లో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో మొత్తం 77 సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈమె ఒక బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరి ప్రేమకు గుర్తుగా నలుగురు ఆడపిల్లలు సంతానముగా ఉన్నారు. ప్రస్తుతం నలుగురు కూతుర్లు కూడా కెరీర్ లో సెటిల్ అయిపోయారు. కాగా అరుణ అన్ని బాధ్యతలు తీర్చుకుని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది అన్నది తెలిపింది.

అరుణకు పెళ్లయి మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే మొదటి సంతానమే కూతురు కావడంతో ఇంట్లో అత్త మరియు అమ్మ వాళ్ళు కొంచెం బాధపడ్డారట.. కానీ అప్పుడు నా భర్త నాకు అండగా ఉంది దైర్యం చెప్పాడు. ఇక అప్పటి నుండి వరుసగా కొడుకు పుట్టాలని అరుణ అమ్మ అత్తయ్య చెప్పిన విధంగా నాలుగు కాన్పులు ఎదురుచూసింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వరుసగా నలుగురు కూడా అమ్మాయిలే పుట్టారు. దీనితో రెండు కుటుంబాల పెద్దలు చాలా బాధపడ్డారు. అయితే ఎవరికైనా కొడుకు ఉండాలని అనిపిస్తుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని పెద్దవాళ్లు భావిస్తారు. అయితే అరుణ విషయంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ముఖ్యంగా అరుణ అత్త అమ్మలు అయితే బోరున ఏడ్చారట. అంత కథ జరిగిందట… కొడుకు పుట్టకపోవడం వలన అంటూ అరుణ అప్పట్లో జరిగిన విషయాలను పంచుకుంది.

Share post:

Popular