టికెట్ కొనడానికి క్యూ లో నిల్చున్న మహేష్ బాబు..వీడియో వైరల్..!!

ఈ మధ్య కాలంలో జనాల్లో క్రియేటివిటీ బాగా పెరిగిపోతుంది. రోజుకో కొత్త టాలెంట్ తో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. అదేవిధంగా, సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ నటులు కూడా తమ సినిమా ప్రమోషన్స్ ని భిన్న విభిన్నంగా చేస్తున్నారు. సినిమా ను తీయ్యడం గొప్ప కాదు..ఆ సినిమాకి ఎంత ప్రమోషన్ చేశాం..ఏ రేంజ్ లో చేశాం..అది జనాల్లోకి వెళ్లిందా లేదా..ఇదే ఇంపార్టెంట్. దర్శకధీరుడు రాజమౌళి లాంటి వాళ్ళే తమ సినిమా ప్రమోషన్స్ కోసం మూడు నెలల ముందు నుండే రెడీ గా ఉంటారు.

అయితే, రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రీసెంట్ గా ఆయన పరశూరామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు. మల్టీ టాలెంటెడ్ అడవి శేషు హీరో గా , హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్న చిత్రం..”మేజర్”. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్‌ చిత్రం రూపొందింది. జూన్‌ 3న సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

మహేష్‌బాబు నిర్మాతగా మారి మేజర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా మహేష్‌కి చెందిన జీఎంబీతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం ..చిత్ర బృందం మహేశ్ బాబు ని కూదా రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే ఓ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. “ఆ వీడియో లో అందరు..మేజర్ సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ అయిన నిహారిక ఎన్ఎమ్‌..ఇది మేజర్ టికెట్స్ కౌంటర్ నేనా..అంటూ అడగ్గా..ముందు ఉన్న వ్యక్తి ..అవును అంటాడు. ఇక అప్పుడే చాలా మంది మధ్యలోకి అవ్చ్చి దూరుతుంటారు..ఈ క్రమంలోని అడవి శేష్..లైన్ మధ్యలో దూరగ్గా..ఆమెకు శేషు కి స్మాల్ ఫైట్ అవుతుంటుంది.. ఈ క్రమంలోనే మహేస్ లైన్లో వచ్చి దూరుతాడు. అప్పుడే నీహారిక ‘హే బాబు”,..అంటూ అరుస్తుంది. దీంతో వెనక్కి తిరిగిన మహేష్ ను చూసి ఫిదా అవుతుంది. మహేష్ లైన్ లో దూరిన ఏం అనదు..ఈ క్రమంలోనే అతని నెంబర్ అడుగుతుండ గా..ఆయన తప్పించుకుని వెళ్లిపోతారు. ఇక అప్పుడు అడవి శేష్ నా నెంబర్ ఇవ్వనా అని అడగ్గ..నీహారిక ఓకే అంటుంది” దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular