మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..అభిమానులారా కాస్కోండి..!!

తన దైన స్టైల్ తో, బాడీ లాంగ్వేజ్ తో, నటనతో..ముఖ్యంగా అందంతో ..కోట్లాది మంది అభిమానులను మెప్పిస్తున్నాడు ఘట్టమనేని నట వారసుడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ప్రీన్స్ మహేశ్ బాబు. చూసేందు కరెంట్ తీగ లాగ సన్నగా ఉంటాదు..కానీ ముట్టుకుంటే దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. సైలెంట్ గా , సాఫ్ట్ గా ఉన్న ఈ హీరో..రీసెంట్ గా సర్కారు వారి పాట తో తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు. పరశూరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకుంది.

ఇక ఈ సినిమా తరువాత మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తి అయ్యాయి. మరి కొన్ని రోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ పనులు ప్రారంభంకానున్నాయి. ఈ సినిమాలో మహేష్ పక్కన రెండోసారి హీరోయిన్ గా నటిస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకోని ఉంది పూజా. ఇది వరకే వీళ్లు మహర్షి సినిమాలో కలిసి నటించి..హిట్ పెయిర్ గా నిలిచారు.

కాగా, #SSMB 28 కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. కానీ, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా..అభిమానులకు బంపర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేశ్. 31 మే కృష్ణ పుట్టిన రోజు..ఆ రోజు సినీ ప్రియులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు #SSMB 28 మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు అదే రోజు టైటిల్‌ని కూడా రివీల్ చేయబోతున్నారట టీం. ఇప్పటికే సినిమా టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించేసారట. కానీ టైటిల్ ని మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. కానీ, ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం తన తండ్రి సినిమా కు రిలేటేడ్ గా ఉంటుందని.. క్రేజీ టైటిల్‌ అని తెలుస్తుంది. దీంతో.. ఆ క్రేజీ టైటిల్, తమ అభిమాన హీరో మహేశ్ లుక్స్ ఎలా ఉంటాయని ఫ్యాన్స్ సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Popular