“త్రివిక్రమ్ – మహేష్ బాబు” సినిమా కథ లీక్… షాక్ లో ఇండస్ట్రీ ?

గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబుకి 28 వ సినిమా కావడం విశేషం. ఇప్పటి వరకు వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా 2005 లో తొలిసారి త్రివిక్రమ్ మహేష్ లు అతడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీగా నిలిచింది. ఇదే నమ్మకంతో అయిదు సంవత్సరాల తర్వాత ఖలేజా సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా మహేష్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. అయితే త్రివిక్రమ్ మహేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రెండు సినిమా లలోనూ లోక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ మహేష్ కొన్ని ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ గురించి నాకు లైఫ్ లో ఉపయోగపడే సినిమాలు ఇస్తూ ఉంటాడని పొగిడాడు. కాగా తాజాగా వీరి నుండి వస్తున్న సినిమా గురించి ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండటం విశేషం. ఇప్పుడు ఈ సినిమా కథ ఎలా ఉంటుంది అన్న విషయం చర్చలో ఉంది. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ నుండి వచ్చిన సినిమాల్లో అరవింద సమేత మరియు ఖలేజా లు తప్ప మిగిలినవి అన్నీ కూడా ఒకే కథతో వచ్చినవే కావడం విశేషం. ఈ కథలు అన్నీ కూడా రెండు కుటుంబాల మధ్యనే జరిగాయి.. ఒక కుటుంబానికి కష్టం రావడం.. మరొక కుటుంబం నుండి హీరో ఆ ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తీర్చడం కథాంశంగా వచ్చాయి. ఈ కథలో భాగంగా మధ్యలో కామెడీ, సెంటిమెంట్స్, ఫైట్స్ మరియు పాటలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొత్త కథేమీ కాదు..పాటు కథలను మిక్సింగ్ చేసి తీస్తాడు అంటూ ఫ్యాన్స్ కొందరు అంటున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే… ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో అద్భుతమైన కథతో వచ్చి హిట్ అయిన మూవీ… నువ్వు నాకు నచ్చావ్… ఈ సినిమా కంటెంట్ ఉంటుందని అంటున్నారు. ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో తన తండ్రి ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళడం మరియు ఆ ఇంట్లో హీరోయిన్ మరియు వారి చెల్లెలితో లవ్ లో పడడం జరుగుతుందట. ఇదే కథ అని ప్రచారం లో ఉంది. అయితే మెయిన్ పాయింట్ ఇదే అయినప్పటికీ… టాకింగ్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఇక యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరి వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా హిట్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట. అన్నీ కుదిరితే జూలై లో షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మహేష్ నుండి వచ్చిన సర్కారు వారి పాట మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి పరుశురాం డైరెక్టర్ గా వ్యవహరించాడు.

Share post:

Popular