వావ్: అభిమానుల కోసం..మహేశ్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్ గా హీరోగా నటించిన చిత్రం “సర్కారువారి పాట”. విజయ్ దేవరకొండతో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పరశూరామ్..ఈ సినిమా ను డైరెక్ట్ చేయడం సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. బ్యాంక్ లను మోసం చేసి బడా రాజకీయ నేతలు, బిజినెస్ మ్యాన్ లు ఎలా తప్పించుకుంటున్నారో ..వాళ్ళ కారణంగా సామాన్య ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారో కళ్లకు కట్టిన్నట్లు చూయించాడు డైరెక్టర్. ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకునే సీన్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ అందాలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలో కీర్తి-మహేశ్ మధ్య వచ్చే సీన్స్ సినిమా ను మరో మెట్టు ఎక్కించేశాయి. కీర్తి డబ్బు కోసం మహేశ్ ని మోసం చేయడం ..మధ్యలోకి వాళ్ల నాన్న ని ఎంటర్ చేయడం..అక్కడ మహేశ్ లోని మరో యాంగిల్ బయటకు రావడం..ఆ టాపిక్ పది వేల కోట్ల అప్పుకి లింక్ పెట్టడం..టోటల్ గా సినిమా కాన్ సెప్ట్ అభిమానులకు రీచ్ అయ్యింది.

ఈ క్రమంలోనే సినిమా మంచి విజయం అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా..సర్కారువారి పాట టాప్ లో ఉంది. నాలుగు రోజుల్లోనే 150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేసింది. దాదాపు 95 కోట్ల షేర్ రాబట్టేసింది
దీంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ పార్టీ ని కర్నూల్ లో గ్రాండ్ జరిపింది. ఈ ఫంక్షన్ లో మహేశ్ చాలా కొత్తగా ఫుల్ జోష్ లో కనిపించారు. అంతేనా..తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మహేశ్ స్టేజి పైకి వచ్చి లైవ్ లో డ్యాన్స్ వేశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ అయిన మ మ మహేశా పాటకు. మామూలుగా మహేశ్ ఎప్పుడు కూడా స్టేజ్ మీదకు ఎక్కి డ్యాన్స్ వేయరు. ఎందరు బతిమిలాడినా కూడా మొహమాట పడుతుంటారు తప్పిస్తే ఆయన డ్యాన్స్ వేయరు. ఈ ఈవెంట్ లో తమన్ డ్యాన్సర్లతో స్టెప్పులు వేస్తుండగా..మహేష్ బాబు కూడా స్టేజీ పైకి వచ్చి మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. మీ అభిమానం చూస్తుంటే ఆపుకోలేకపోయానని..అందుకే ఇలా చేసానని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.

Share post:

Popular