ఎన్టీఆర్ బర్తడే ట్రీట్.. ఫ్యాన్స్ కు డబుల్ సర్ప్రైజ్ లు రెడీ..?

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి.. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలో నెం 1 హీరో గా కొనసాగుతున్న తారక్ అంటే స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అనవసరం గా ఓ మాట దాటడు.. తన జోలికి వస్తే..తాట తీసేస్తాడు.. ప్రెండ్ షిప్ కి ఇచ్చే వాల్యూ చూస్తే..మనకు ఇలాంటి ఫ్రెండ్ లేడే అనిపిస్తుంది. ఇక తారక్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి.. ఇరగదీసుడే.. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్నారు.

రీసెంట్ గా RRR సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ప్రజెంట్ కొరటాల శివ తో ఓ సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మే20 న ఈ టైగర్ పుట్టినరోజు. ఆ రోజు అభిమానులకి పండగే . మళ్లీ సంక్రాంతి పండుగ వచ్చింది అన్నట్లు చాలా గ్రాండ్ గా హ్యాపీగా జరుపుకుంటారు. కాగా, ఆ రోజున అభిమానులను ఇంకా హ్యాపీగా ఉంచదానికి కొరటాల శివ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది.

తారక్ పుట్టినరోజు సంధర్భంగా.. NTR 30 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్..అలాగే టైటిల్ రివీల్ చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసాడట కొరటాల శివ. ఇక మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే తారక్ కోసం బిగ్ పార్టీని ఏర్పాటు చేశాడట. ఇలా వరుస షాకింగ్ సర్ ప్రైజ్ లతో తారక్ పుట్టిన రోజు మరింత స్పెషల్ గా మారనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పై అభిమానులు భారీ స్దాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ల కాంబోలో జనత గ్యారేజ్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరి చూడాలి కొరటాల ఎలాంటి టైటిల్ పెడతారో..?

Share post:

Popular