ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే వీరిద్ద‌రిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో… కొర‌టాల ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో స‌క్సెస్ అయ్యింది. కొర‌టాల ఆచార్య డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక గ‌తంలో కొర‌టాల – ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు వీరి కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమాపై కూడా నేష‌న‌ల్ వైడ్‌గా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఎప్పుడో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే ఈ జూన్‌లో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు మొదట వచ్చినా షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు జులైలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే కొత్త లుక్‌లోకి రావ‌డంతో పాటు 9 కేజీల వ‌ర‌కు బ‌రువు కూడా త‌గ్గాడు. మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Popular