సర్కారు వారి పాట: మహేష్ చెప్పిన డైలాగ్ పవన్ కోసమా..?

“సర్కారు వారి పాట”.. టైటిల్ లోనే మంచి పవర్ ఉంది. ఫస్ట్ నుండి సినిమా టైటిల్ వింటుంటేనే గవర్న్మెంట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి అని జనాలు అనుకుంటూనే ఉన్నారు. డైరెక్టర్ అలాగే ఆ జోనర్ ని టచ్ చేసి.. రాజకీయలను పరోక్షంగా గెలికాడు అంటున్నారు జనాలు . సినిమా స్టొరి ఆల్ మోస్ట్ ఆల్ వాస్తవంగా జరిగిన దే చూయించారు. కాకపోతే ఆ ఎగకొట్టిన డబ్బులు కట్టేశారు గా ..ఆ లైన్ తప్పిస్తే మిగతా స్టోరీ అంతా మనం రోజు పేపరో చదివిదే..టీవీల్లో చూసేదే.

ఈ సినిమా స్టోరీ సంగతి కాసేపు పక్కన పెడితే..సినిమా లో ని డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి . కీర్తి-మహేశ్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఎంత పడాయో…మహేశ్ -రాజేంధ్రనాధ్ మధ్య పవర్ పంచ్ డైలాగ్స్ అంతా బాగా కుదిరాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన్నప్పుడు” నేను విన్నాను-నేను విన్నాను” ఈ డైలాగ్ సృష్టించిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జగన్ మెప్పు కోసమే వాడారని కొందరు.. వైసీపీ కి ఫేవర్ గా ఉందని మరి కొందరు ఆడేసుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక స్టొరీని బట్టి వెళ్ళారు అని అర్ధమైంది. ఇక ఇప్పుడు ఆ సినిమా నుండి మరో డైలాగ్ చర్చనీయాంశంగా మారింది.

ఆ డైలాగ్ ను జనసేనాని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. “వావ్..మహేశ్..నువ్వు చెప్పింది అక్షర సత్యం” అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ డైలాగ్ విన్న వారు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించే అని ఇట్టే పట్టేస్తారు. అంత స్ట్రైట్ ఫార్వడ్ గా ఉంది డైలాగ్ . ఇంతకి ఆ డైలాగ్ ఏంటి అనుకుంటున్నారా..? ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పవర్‌ఫుల్ డైలాగ్..”జనం తోడు ఉన్నోడికి విజయం దక్కకపోయినా ఆ జనం అతడి వెన్నంటే ఉంటారు..అది చాలు!” అని ఉంటుంది. ఇది పర్ ఫెక్ట్ గా పవన్ కోసమే..”లాస్ట్ ఎన్నికల్లో ఓడిపోయినా..ఆయనను నమ్ముకుని ఉన్న జనాలు ఆయనతోనే ఉన్నారు..ఆయనకు అది చాలు..ప్రజా సేవకి పవర్ తో పదవులతో పనిలేదు” అంటూ పవన్ అభిమానులు ఆ డైలాగ్ ను హైలెట్ చేస్తున్నారు.