అబ్బా.. ఏమైంది యశ్‌ నీకు..పెద్ద తప్పే చేస్తున్నాడే..?

సలామ్..రాఖీ భాయ్..ఈ పాట వినగానే మనకు ముందు గా గుర్తు వచ్చేది ఆ గడ్డం..ఆ స్టైలీష్ వాక్..ఆయన కళ్లల్లో కనపడే పొగరు. ఆ పాట వింటూ..ఉంటే ఏదో తెలియని ఫీలింగ్..అహంకారం..పొగరు మనలోని కనిపిస్తాయి. అంత బాగా తనలో మనల్ని లీనమైయేలా చేసుకున్నాడు కన్నడ రాక్ స్టార్ ..యశ్. ఒకప్పుడు ఈ పేరు అస్సలు ఎవ్వరికి తెలియదు. చిన్న హీరోగా కన్నడ లో ఏవో సినిమాలు చేసారు అంతే.

కానీ, ఇండస్ట్రీకి ఓ ఉప్పెనలా KGF అంటూ సైలెంట్ టాక్ తో వచ్చి..ఇండస్ట్రీ లెక్కలని మార్చేసాడు యశ్. సినిమా రిలీజ్ కి ముందు కూడా పెద్ద టాక్ లెదు..కానీ, సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మాత్రం అన్ని ఇండస్ట్రీల కళ్లు యశ్ పై పడ్డాయి . ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి..ఆయన అనుకున్న కధకి యశ్ ని చక్కగా మార్చేశాడు . ఇక ఆ తరువాత రిలీజ్ అయిన KGF2 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో అయితే టాప్ సినిమాగా రికార్డ్ నెలకోల్పింది .

అయితే, చిన్న హీరోలే ఒక్క సినిమా యావరేజ్ టాక్ వస్తుంటేనే రెండు మూడు సినిమాలకి కమిట్ అవుతున్నారు. మరి ఇండియన్ సినిమా చరిత్ర లెక్కలని తిరగరాసిన యశ్ ..తదుపరి సినిమా ఏంటి..? అని ప్రశ్నిస్తే…నో ఆన్సర్. ఈ విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కన్నడ మీడియా లో మాత్రం యశ్ మళ్లీ ప్రశాంత్ నీల్ తోనే KGF3 చేస్తున్నాడు అంటూ వార్తలు రాస్తున్నాయి. ఒక్కవేల అదే నిజమైతే..యశ్ ని మనం తెర పై చూడాలంటే మరో నాలుగేళ్ళు ఆగాల్సిందే. ప్రజెంట్ సలార్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్..ఆ సినిమా అయిపోయిన వెంటనే,..తారక్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ రెండు అయిపోయాకనే యశ్ దగ్గరకు వస్తాడు..అలా చూసుకున్న ఈ సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా నాలుగేళ్లు పైనే పడు తుంది. ఈ లోపు యాశ్ ఖాళీ గా ఉంటే ఖచ్చితంగా ఆయన కెరీర్ కి దెబ్బ అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి యశ్ ఏం చేస్తాడొ..?

Share post:

Popular