ఆ ఒక్క రీజన్ తో మెగా హీరో సినిమాలో నుండి ఔట్..అడవి శేష్ మాటలకు ఇండస్ట్రీ షాక్..!!

“అడవి శేష్”..చూడటానికి చాలా సైలెంట్ గా..నెమ్మదిగా ..తన పని తాను చేసుకుపోయే నటుడు. చూడటానికి ఆరు అడుగులు ఉంటాడు. ఆ హైట్ కు తగ్గట్లే వెయిట్. తెల్లటి స్కిన్ టోన్. నవ్వితే పడే సొట్ట. ఏ అమ్మాయి పడిపోకుండా ఉంటాది చెప్పండి. అమ్మాయిలే కాదు.. పెళ్లైన ఆంటీలు కూడా అడవి శేష్ వెంట పడ్డారట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం “మేజర్”.

ముంబై తీవ్రవాదుల దాడిలో తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. ఆ దాడిలో తన ప్రణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్.. నిజ జీవితాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమానే ఈ “మేజర్”. జూన్ 3న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. ఫ్యాషన్, లవ్ ,ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఎక్కువుగా రిలీజ్ అవుతున్న తరుణంలో ఇలాంటి రియల్ హీరో గురించి కూడా జనాలు తెలుసుకోవాలని..ప్రయత్నంగానే ఈ సినిమా తెరకెక్కించామని అడవి శేష్ చెప్పుకొచ్చారు.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా..అలీ తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన..తన మేజర్ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు..తన పరసనల్ లైఫ్ విషయాలను కూదా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో తల్లిది తెలంగాణ అని..నాన్న ది ఆంధ్ర అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం కష్టపడ్డానని.. చాలా ట్రై చేస్తే.. మెగా హీరో నాగబాబు మెయిన్ లీడ్ చేసిన కాజల్, శివ బాలజీ, నటించిన చందమామ సినిమాలో కాజల్ లవర్ రోల్ వచ్చిందని. అదే నవదీప్ చేసిన రోల్ కి ముందు అనుకుంది..అడవి శేష్ నట. రెండు రోజులు షూటింగ్ కూడా చేశారట కానీ, సడెన్ గా ఆయనను తీసేశారని చెప్పుకొచ్చారు. అయితే, అడవి శేష్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు.. చందమామ సినిమాలో నవదీప్ రోల్ కి చాలా అల్లరి చిల్లరిగా ఉండాలి..ఆ రీజన్ తోనే ఆయనను తొలగించి ఉండచ్చు అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తన కష్టం తో టాలెంట్ తో మంచి మంచి సినిమాలను చూస్ చేసుకుంటున్న అడవి శేష్..మేజర్ సినిమా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Popular