మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ కి వెళ్లిన గుజరాత్ టైటాన్స్ ..?

వారెవ్వా..అదృష్టం అంటే ఇదేగా.. జనరల్ గా మన పెద్ద వాళ్ళు అంటుంటారు..అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవ్వరు చెప్పలేరు.. నువ్వు కష్టపడి పని చేస్తే ..ఆ ఫిలితం నీకు ఎలాగైన దక్కుతుంది అని. ఇప్పుడు అదే మాటను గుర్తు చేసుకుంటున్నారు ఐపీఎల్ లవర్స్. ఐపీఎల్ రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వారికి..పైగా గుజరాత్ టైటాన్స్ ను సపోర్ట్ చేసే వారికి అసలు మ్యాటర్ అర్ధమైపోయే ఉంటుంది.

నిజానికి గత సీజన్స్ లో ఈ గుజరాత్ టైటాన్ లేదు . ఈ సీజన్ కే యాడ్ అయ్యింది. రావడం రావడమే బొమ్మ చూయించేసింది మిగతా జట్లుకి. ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చినా ఈ గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ సీజన్‌లోనే తన సత్తా చాటూ తూ ..తనదైన ముద్ర వేసేసి…క్రికెట్ లవర్స్ ను ఫిదా చేసింది. అద్బుతమైన బౌలింగ్ తో బౌలర్స్..టైం చూసి సిక్సర్లతో రెచ్చిపోయే బ్యాట్స్ మెన్స్..అన్నింటికన్నా ముఖ్యంగా ..టీం ను ఎలా కంట్రోల్ చేయాల్లో తెలిసిన కెప్టెన్..హర్ధిక్ పాండ్యా.

తాజా సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన ఆడిన ఈ సూపర్ గుజరాత్ టైటాన్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 విజయాలతో దుమ్ముదులుపేసింది. దీంతో ఎవ్వరు ఊహించని విధంగా నెం.1 స్థానంలో నిలిచి.. ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఐపీఎల్ లో నేటి నుంచి ఈడెన్ గార్డెన్ (కోల్కతా) వేదికగా ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. తొలి క్వాలిఫైయర్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ – రాజస్తాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరుగనున్నది. ఈ మంగళవారం రాత్రి 7.30 గంటలకి గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ టీంతో మ్యాచ్‌లో తలపడబోతోంది. ఒక్కవేళ ఈ రోజు మ్యాచ్ లో అసాధారణ రికార్డులున్న గుజరాత్ టైటాన్స్‌ని రాజస్థాన్ ఓడిస్తే..అది రికార్డ్ అనే చెప్పాలి. టైటాన్స్ ఆశలనీ గల్లంతే.

అలా జరగడానికి కేవలం కష్టమే కాదు లక్ కూడా ఉండాలి. కానీ, ప్రస్తుత పరిస్ధితి చూస్తుంటే..ఆల్ మోస్ట్ ఆల్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి చేరిపోయిందనే అంటున్నారు విశ్లేషకులు. మనకు తెలిసిందే కోల్కతా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భీకరంగా వర్షం పడుతుంది. ఈ వర్షం మ్యాచ్ టైంకి ఆగిపోతే పర్లేదు..లేదంటే..ఇప్పటి వరకు ఇరు టీం లకు ఉన్న పాయింట్స్ ఆధారంగా ఒక్క టీం ను డైరెక్ట్ గా ఫైనల్ కి పంపించేస్తారు. సో, కళ్లు మూసుకుని చెప్పేయచ్చు ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి వెళ్లిపోతుందని ..? ఐపీఎల్ 2022 సీజన్‌లో చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు రాబట్టిన టీమ్‌గా గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది.