శోభ‌న్‌బాబు ఆస్తి ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శోభన్ బాబు. ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించిన నటులలో ఈయనకు మొదటి స్థానం ఉందని చెప్పవచ్చు. శోభన్ బాబు అందానికి ముఖ్య కారణం ఆయన జుట్టు అని చెప్పవచ్చు. శోభన్ బాబు కు ఉండే జుట్టు రింగు వల్ల అప్పటికీ ఇప్పటికీ ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ఈ కాలంలో కూడా శోభన్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు అంటే మనం ఆయన ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

శోభన్ బాబు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవ్వరికి తెలియదు. శోభన్ బాబు కంటే అత్యధిక డబ్బు ఉన్న హీరో మరొకరు లేరని కూడా ఆయన స్నేహితుడు మురళీమోహన్ తెలియజేయడం జరిగింది. గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినప్పుడు మురళీమోహన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న శోభన్ బాబు.. కొన్ని వేల ఎకరాల భూములను కొన్నారట.

అవన్నీ లెక్క వేస్తే ఇప్పుడు కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పారు మురళీమోహన్. మరి శోభన్బ బాబు మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ దాదాపు గా రూ.80 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.1976 లో కొన్ని మేజర్ కంపెనీలలో షేర్లు కూడా తీసుకున్నారు శోభన్ బాబు అని మురళీమోహన్ తెలియజేశారు. అలాగే చెన్నై శివార్లలో కూడా శోభన్ బాబు కు సంబంధించి కొన్ని వేల ఎకరాలు స్థలాలు ఉన్నాయి అని మురళీమోహన్ తెలియజేశారు.

ఇక కేవలం శోభన్ బాబు స్ఫూర్తితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలు పెట్టాను అని మురళీమోహన్ తెలియజేశారు. శోభన్ బాబు ఉదయం పూట తనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తను బిల్డింగులను చూడడానికి మొదలుపెడితే సాయంత్రం అయినా కూడా ఆయన ఇంటికి తిరిగి వచ్చేవారు కాదట. దీన్ని బట్టి చూస్తే ఈయన ఆస్తి విలువ ఎంత ఉంటుందో మనం చెప్పనవసరం లేదు.

Share post:

Popular