వామ్మో: మెగా కోడలి వార్షికాదాయం అన్ని కోట్లా..?

మెగా కోడలు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదల గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె మెగా కోడలు మాత్రమే కాదు అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టింది. ఒకవైపు ఇంటి కోడలిగా మెగా వారి బాధ్యతలు చూసుకుంటూనే.. మరొక వైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది ఉపాసన. అంతేకాదు సామాజిక అంశాలపై కూడా ఎంతో చలాకీగా ఉండే ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.

అంతే కాదు మొన్న మధ్యకాలంలో సుమారుగా 100 వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా చాలా మందికి ఆరోగ్య సూచనలు చేస్తూ.. సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టడం, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు గ్రామీణ వైద్య సేవలు, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడంలో ఈమె తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు.

ఇక ఇలా దానధర్మాలు , సహాయ కార్యక్రమాలు చేపట్టే ఉపాసన ఎంత మొత్తంలో సంపాదిస్తుంటారు అనే విషయం ప్రతి ఒక్కరికి సందేహాన్ని కలిగిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే పలు సర్వేల ప్రకారం ఉపాసన సంవత్సరానికి సుమారుగా రూ. 30 కోట్లకు పైగా సంపాదిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఉపాసన సంపాదిస్తోంది కాబట్టే ఆ సంపాదన లో నే ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నిజానికి ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యం కాదు ఎంత మంది అభిమానం పొందాము అన్నదే ముఖ్యం.. అందుకే ఎవరు ఎంత డబ్బు సంపాదించినా సేవాకార్యక్రమాలలో మాత్రం మెగా కోడలు ఉపాసన తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు.