ఆడపులి VS మేక: బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే..?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ అంటే జనాలకు అదో పిచ్చి. ఈ షో ని ఇష్టంగా రోజు చూసే జనాలు ఉన్నారు. ఇదే దరిద్రం రా బాబోయ్ అంటూ తిట్టుకునే వాళ్లు ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా..ఎలా అనుకున్నా..వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు బిగ్ బాస్ టీం. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ఈసారి ఓట్ట్ లో స్టార్ట్ అయ్యి సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఇన్నాళ్లు ఓ గంట సేపు మాత్రమే చూసిన జనాలు ఈసారి ఫుల్ ఎపిసోడ్ లైవ్ లో చూసి తెగ ఎంజాయ్ చేశారు.

మనకు తెలిసిందే బిగ్ బాస్ అంటే రియాలిటీ గేమ్ షో. అక్కడ అంతా రియల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. కానీ అది తప్పిస్తే అన్ని జరుగుతాయి అంటారు ఆ షో చూసే జనాలు. గత ఐదు సీజన్స్ కి ఈ OTT కి చాలా తేడా ఉంది. ముఖ్యం గా ఈసారి కొందరు ఓల్డ్ కంటెస్టెంట్లని హౌస్ లోకి పంపిచారు టీం. దీంతో ఆట మరింత రసవత్తరంగా సాగి..కోట్లాటలు, ప్రేమలు, మోసాలు, బూతులు తిట్టుకోవడాలు..వాయబ్బో అది మాటల్లో చెప్పలేనిది. నానా రచ్చ చేసారు కంటెస్టెంట్లు. ఇక ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసింది. మొదటి నుండి టఫ్ ఫైట్ ఇస్తున్న అఖిల్-బింధు మాధవి పైనే..అభిమానుల ఓట్లు ఎక్కువ పడుతున్నాయి.

ఇక ఫైనల్ ఫైట్ కూడా వీళ్ల మధ్యనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. హౌస్ లో ఇన్నాళ్ళు వీళ్ల మధ్య జరిగిన రచ్చ మనకు తెలిసిందే. బయట అయితే..అఖిల్ ని మేక అని..బింధు మాధవిని ఆడపులి అంటూ ఫ్యాన్స్ పిలుస్తున్నారు. అంతేనా ప్లేక్సీలు కట్టి మరి సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి టైటిల్‌ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నారు. అలాగే నామినేషన్స్ టైంలో శివంగిలా మారిపోయి హౌస్‌మేట్స్‌ను ఓ కబడ్డీ ఆడుకున్న బిందుమాధవి ధైర్యానికి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అంతేకాక ఇప్పటి వరకు లేడీస్ ఎవ్వరు కప్ గెలవలేదు. అందుకోసమని బింధు మాధవికి లేడీస్ సపోర్ట్ కూడా ఎక్కువైంది. ఆమెను ఎలాగైనా గెలిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈరోజుతో ఓటింగ్‌ ముగియనుండటంతో ఇరువురి ఫ్యాన్స్‌ వీలైనన్ని ఓట్లు గుద్దుతున్నారు. ఇప్పటి వరకు బయట టాక్ ప్రకారం చూసుకుంటే..బింధు మాధవినే విన్నర్ అని క్లీయర్ గా అర్ధమైపోతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

Share post:

Popular