అదే నిజమైతే.. ప్రశాంత్ నీల్ కు భారీ బొక్కే..?

జనరల్ గా మనకు దర్శక ధీరుడు అనగానే గుర్తు వచ్చేది,,”రాజమౌళి”. అపజయం ఎరుగని డైరెక్టర్ గా ..ఇప్పటి వరకు తీసిన అన్నీ సినిమాలను హిట్ కొడుతూ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. అంతేనా బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ స్దాయిలో గుర్తింపు అందించాదు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు గర్వంగా ఇది మా సినిమా , మా డైరెక్టర్ రాజమౌళి అని కాలర్ ఎగరేసి చెప్పుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరుని మొత్తం..కేవలం ఒక్క సిరీస్ తో సంపాదించుకునేసాడు..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ “ప్రశాంత్ నీల్”.

కన్నడ రాక్ స్టార్ యాష్ తో కలిసి KGF సినిమా ను తెరకెక్కించి..అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈయన..ఆ తరువాత KGF 2 తో ఇందస్ట్రీ లెక్కలని మార్చేసాడు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే..ప్రశాంత్ నీల్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రాజమౌళి పేరుతో ప్రశాంత్ నీల్ పేరుని కూడా జత చేస్తూ..ఆ స్దాయిని ఇచ్చేశారు. దీంతో ప్రసాంత్ నీల్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఉన్నారు. కానీ, సోషల్ మీడియాలో ఓ సోకాల్డ్ బ్యాచ్..ప్రశాంత్ నీల్ ని టార్గెట్ చేస్తూ..కొన్ని పాయింట్స్ ని హైలెట్ చేస్తుంది.

రాజమౌళికి ..ప్రసాంత్ కి పోలిక లేదు. రాజమౌళి సినిమా సినిమా కి ఢిఫరెంట్ కధతో..లుక్స్ తో..ఛేంజ్ చేస్తూ స్టైల్ మారుస్తున్నాడు. కానీ, ప్రశాంత్ నీల్ ఎప్పుడు ఒక్కటే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు. ఆ బొగ్గు కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ నే కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. KGF1, KGF2 సంగతి ఓకే. కానీ, ప్రశాంత్ తదుపరి సినిమా సెలార్ లోను ప్రభాస్ లుక్ కోల్ బ్యాక్ డ్రాప్ తోనే ఉంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన NTR31 లుక్స్ కూడా సేమ్ డిట్టో గా కోల్ బ్యాక్ డ్రాప్ లానే ఉంది. ఒక్కే జోనర్ లో సినిమాలు తీసుకుంటూ..ఆ స్టైల్ నే మళ్లీ చూపిస్తుంటే..జనాలకి ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఒక్కవేళ్ల అభిమానుల నుండి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చి..సలార్ సినిమా ఫ్లాప్ అయితే..ఖచ్చితంగా ప్రశాంత్ కెరీర్ కి భారీ నష్టం తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు, మరి చూడాలి ప్రశాంత్ ఎలా కవర్ చేస్తాడో..?

Share post:

Latest