అరెరె..భళే ఇరుక్కున్నాడే..YSR నిజంగా చెప్పాడా..?

ఇప్పుడు అటు ఇండస్ట్రీలోను ఇటు రాజకీయాలోను డైరెక్టర్ పరశూరామ్ చెప్పిన ఆన్సర్ పెద్ద దుమారమే రేపుతుంది. అస్సలు ఏమైందంటే… సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యులు ఇస్తూ సినిమా యూనిట్ తెగ హడావుడి చేస్తుంది. అటు మహేశ్, ఇటు పరశూరామ్, మధ్యలో కీర్తి సురేష్..అందరు బిజీ బిజీ మారిపోయారు. ఉన్న తక్కువ టైంలోనే వీలైనంత పబ్లిసిటీ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంతా బాగానే ఉంది.

కానీ, ఓ ఇంటర్వ్యుల్లో పరశూరామ్ కి ..సినిమా లో మహేశ్ బాబు చెప్పే డైలాగ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాలో మహేశ్ నోట..YSR ఫేమస్ డైలాగ్ వస్తుంది. “నేను ఉన్నాను-నేను విన్నాను” అనే డైలాగ్ సర్కారు వారి పాట సినిమా వాడటం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జగన్ ని ఫిదా చేయడానికే ఇలా డైరెక్టర్ సెట్ చేసారని.. ఇది టూ మచ్ భజన అని కొందరు కామెంట్స్ చేశారు. ఇదే ఇష్యూ పై యాంకర్ పరశూరామ్ ని ప్ర్శ్నించగా.. ఆయన మాట్లాడుతూ ..”అలా ఏం లేదు.. నేను YS రాజశేఖర్ రెడ్డి గారికి బిగ్ ఫ్యాన్. ఆయన ఆశయాలు నన్ను బాగా అట్రాక్ట్ చేసాయి. చాలా తక్కువ పదాలతో చాలా పెద్ద భావం చెప్పారని, జనాలకు భరోసా ఇచ్చారని అనిపించిందని.. ఆయన పాద యాత్ర టైంలో ఈ మాట నాకు చాలా కనెక్ట్ అయ్యింది. అందుకే నేను ఈ సినిమాలో టైం కి సెట్ అయ్యేటట్లు పెట్టుకున్నాను” అని చెప్పుకొచ్చరు.

కానీ, ఇక్కడ బిగ్ డౌట్ ఏంటి అంటే..అస్సలు YSR నిజంగా ఆ డైలాగ్ చెప్పిన్నట్లు ఆధారాలు లేవు. ఒక్క వీడియో కానీ, పేపర్ బిట్ కానీ, ఫోటోలు కానీ చరిత్రలో లేవు. నిజానికి ఈ డైలాగ్ యాత్ర సినిమా లో బాగా ఫేమస్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మమ్మూటి..ఈ డైలాగ్ చెప్పుతారు. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈ డైలాగ్ ను వాడుతూ.. జనాలకి దగ్గరైయాడు తప్పిస్తే.. YSR ఎక్కడ చెప్పలేదు. మరి పరశూరామ్ ఎక్కడ విన్నాడో ఈ డైలాగ్ అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా..జగన్ ను మెప్పించడానికే ఇలా YSR ను వాడుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ ఇష్యూ ని ఎలా కవర్ చేస్తాడో పరశూరామ్..?