సిల్క్ స్మిత చివరగా రాసిన సూసైడ్ లెటర్ చదివితే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు…

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత్ ఇపుడు మన మద్య లేరు అన్న బాధ ఇంకా అందరిలోనూ అలానే ఉంది. సిల్క్ లేని లోటు ఇండస్ట్రీలో అప్పట్లో కొట్టొచ్చినట్టు కనిపించింది… కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో మూడు పదుల వయసులోనే పెళ్లి కుటుంబ బాధ్యతలు లేకపోయినా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అంటే నమ్మశక్యం కాని విషయం, అంతేకాక ఇప్పటికీ అది మిస్టరీ గానే ఉంది. అయితే ఆమె గురించి దగ్గరగా తెలిసిన వారు కొందరు ఆమె చాలా రోజులుగా ఎందుకో ఒక విషయంలో మదన పడుతూ ఉండేదని తాను మరణించడమే అందుకు పరిష్కారం అన్నట్లుగా సిల్క్ మాట్లాడే వారని చెప్పుకొచ్చారు. ఇటీవల అప్పటి స్పెషల్ సాంగ్స్ హీరోయిన్ అనురాధ సైతం సిల్క్ స్మిత మరణించే ముందు రోజు తనకి ఫోన్ చేసింది అని, ఎన్నడూ లేని విధంగా ఒకసారి ఇంటికి రండి మీతో మాట్లాడాలి అని అంది అని అన్నారు. ఆమె మాటల్లో చాలా బాధ వినిపించింది అని పేర్కొన్నారు.

కాగా ఇపుడు మరొక వార్త సిల్క్ స్మిత మరణం వెనుక వున్న రహస్యాల గురించి క్లారిటీ ఇస్తున్నట్లుగా ఉంది. ఒక సెలబ్రిటీ చనిపోతే ఆ వార్త ఎంత వైరల్ అవుతుంది అన్నది తెలిసిందే. అలా సిల్క్ స్మిత్ మరణ వార్తను ప్రజలకు అందించడానికి వెళ్ళిన న్యూస్ రిపోర్టర్ లలో ఒక వార్తా ప్రతినిధి ఇపుడు ఆమె మరణం గురించి అపుడు అతడు దగ్గరగా చూసిన విషయాలను పేర్కొన్నారు. ఆమె చనిపోయిన రోజు దొరికిన సూసైడ్ లెటర్ గురించి తెలిపారు. అలాగే సిల్క్ స్మిత్ మరణించిన సమయంలో వచ్చిన సెలబ్రిటీలు వారి సంభాషణల వంటి వాటి గురించి ఒక డాక్యుమెంటరీని రెడీ చేస్తున్నారు తోట భావనారాయణ.

మద్రాసు సౌత్ జోన్ డీసీపీ సూర్య ప్రకాష్ నుండి న్యూస్ రిపోర్టర్ అయిన భావనారాయణ అయిన నాకు ఫోన్ వచ్చింది ..సిల్క్ స్మిత చనిపోయింది అక్కడికి వెళుతున్నాం వెంటనే వచ్చేయండి అన్నారు. షాక్ అయ్యాను కానీ నాలోని రిపోర్టర్ నా కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో ఒక రిపోర్టర్ గా నా పని మొదలు పెట్టాను.. నాకంటే త్వరగా ఘటన స్థలానికి చేరుకోగల ఫోటోగ్రాఫర్ ను ఒకరిని అక్కడికి ఫోన్ చేసి పంపాను. ఆ తరవాత నేను అక్కడికి చేరుకున్నాను. సిల్క్ స్మిత బెడ్ పై పడి ఉన్నారు. బ్లాక్ టీ షర్ట్, నైట్ ప్యాంటు వేసుకుని ఉన్న ఆమె నిద్రపోతున్నట్లు గానే ఉంది తప్ప మరణించిన వ్యక్తిలా అనిపించలేదు. ఇంతలో పోలీస్ అధికారి సూర్య ప్రకాష్ గారు పిలుస్తున్నారు అంటూ ఒక ఎస్సై వచ్చి నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. ఆయనకు తెలుగు రాదు.. దాంతో ఒక లెటర్ నా చేతిలో పెట్టి చదివి అర్ధం చెప్పమన్నారు. అది చదవడం మొదలు పెట్టాక తెలిసింది అది సిల్క్ స్మిత్ రాసిన సూసైడ్ లెటర్ అని…అందులో ఏముంది అంటే…

నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి పొట్టకూటి కోసం కష్టపడుతూనే ఉన్నాను. నాకంటూ నా సొంత వారు ఎవరూ కూడా లేరు. నా అనుకుని నేను నమ్మిన వారు నన్ను పూర్తిగా మోసం చేశారు. బాబు తప్ప నన్ను ఎవరు ప్రేమగా చూసుకోలేదు. బాబు తప్ప మిగిలిన వారు అంతా నా కష్టం తిన్న వారే అలాగే నన్ను చూసి ఓర్వలేని వారే. జీవితంలో అందరి లాగే నాకు కొన్ని అందమైన కోరికలు ఉన్నాయి. కానీ వాటిని చంపేస్తు నా చుట్టూ ఉన్న వారే నాకు మనశ్శాంతిని కరువయ్యేలా చేసి మరనించేలా చేశారు. నా ఆశలన్నిటిని ఒకరి మీద పెట్టుకుని జీవించా.. కానీ అతడే నన్ను మోసం చేశాడు. ఒకడు 5 సంవత్సరాల క్రితం నాకు జీవితం ఇస్తానని నమ్మించాడు. కానీ ఇపుడు మోసం చేశాడు. రోజు ఆ టార్చర్ ని భరించడం నా వల్ల కాదు అందుకే నాకు ఆ సమయంలో ఏది మంచిది, న్యాయం అనిపించిందో అదే చేశాను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు ఏమో…నేను ఎంతోమందికి సహాయం చేశాను. కానీ అంతా నన్ను వంచనే చేశారు. నా జీవితంలో ఎంతో భరించాను.. కానీ ఇక నా వల్ల కాదు. ఇది రాయడానికి ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. నాకున్న ఏ కొంచమైనా అది బాబుకి నా కుటుంబానికి పంచండి అంటూ రాసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు సిల్క్ స్మిత. పోస్ట్ మార్టం అయ్యాక మళ్ళీ ఆమె అంత్యక్రియలకు వెళ్ళాను… అక్కడికి వచ్చిన హీరో అర్జున్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె చనిపోయే కొద్ది రోజుల ముందే ఒక సినిమా చివరి షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత తనతో మాట్లాడుతున్న సందర్భం లో నేను చనిపోతే చూడటానికి వస్తావా ..?? అని అడిగింది . అందుకు నేను షాక్ అయ్యాను… ఛీ..!! అదేం మాట అన్నాను. అపుడు అది ఆమె సీరియస్ గా అన్నారని అనుకోలేదు అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేసారు అని పేర్కొన్నారు. ఇలా ఆ రోజు తన సూసైడ్ గురించి లెటర్ లో సిల్క్ స్మిత మొత్తం రాసి చనిపోయింది.

Share post:

Popular