ఖుష్బూ కి హీరోయిన్ ఆఫర్… షాక్ లో ఫ్యాన్స్ ?

సినిమా పరిశ్రమలో హీరోయిన్ లుగా చేసిన వారికి వయసు పెరిగే కొద్దీ శరీరం పెరగడం సాధారణమే. కానీ కొందరు సన్నబడినా లేదా లావుగా ఉన్నా అందంగానే ఉంటారు. అదే విధంగా తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎవరు ఈవిడ ? అంటూ షాక్ అవుతున్నారు. అయితే తీరా చూస్తే ఈమె ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ అని తెలుస్తోంది. అదేంటి ఈ విధంగా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈమె వయసుకి ఆ ఫోటోలకు పొంతన లేకుండా ఉంది ఖుష్బూ. ఈమె నార్త్ లో జన్మించింది మరియు తన సినిమా కెరీర్ ను బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. కానీ అలా వచ్చి సౌత్ లో హీరోయిన్ గా స్థిరపడి ఇప్పుడు వయసు మీద పడుతున్నా కొన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు టచ్ లోనే ఉంది.
ఈమె వెంకటేష్ నటించిన సినిమా “కలియుగ పాండవులు” ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

అయితే అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేసి ఫ్యాన్స్ తనను మర్చిపోకుండా కవర్ చేసుకుంది. ఖుష్బూ ఎక్కువగా వెంకటేష్ మరియు నాగార్జున లతోనే నటించడం గమనార్హం. సినిమాలకు కొద్దిగా దూరం అయినా తర్వాత తన రూట్ ను రాజకీయాల వైపుకు మళ్లించింది. అయితే ప్రస్తుతం మాత్రం సినిమాలు, సీరియల్స్ మరియు రాజకీయాలను మూడింటినీ సరిగ్గా మానేజ్ చేస్తూ వస్తోంది. అయితే హీరోయిన్ గా ఉన్న కాలంలో సన్నగా కుందనపు బొమ్మలా ఉన్న ఖుష్బూ పోను పోను లావుగా తయారయింది. కాగా ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోని దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అందరి లాగే తల్లి అయిన తర్వాత లావు పెరిగిపోయింది. కానీ ఖుష్బూ కరోనా కారణంగా దొరికిన లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని తన బాడీ ని తగ్గించడానికి వాడుకుంది.

మీకు తెలిసిందే కరోనా కారణంగా దేశం మొత్తం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. పేదవారి నుండి బిగ్ షాట్ ల వరకూ అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో దొరికిన ఎక్కువ సమయాన్ని ఫిట్నెస్ పై పెట్టింది. అందుకే ఖుష్బూ మూడు నెలలు బాగా కస్టపడి ఏకంగా 15 కిలోలు తగ్గిపోయింది. దీనితో స్లిమ్ గా అయిపోయింది. ఇలా లావుగా ఉన్న ఖుష్బూ సన్నగా అవడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన అందరూ నమ్మలేక నమ్మారు అనుకోండి.

తన కెరీర్ మొదట్లో ఏ విధంగా అయితే ఉండేదో, అదే విధంగా మారిపోవడంతో కొంపదీసి మళ్ళీ హీరోయిన్ గా ఛాన్స్ ఏమైనా వచ్చిందా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తమిళనాడులో ఖుష్బూకి ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెను ఎంతలా ఆరాధిస్తారు అంటే… ఖుష్బూ కోసం గుడిని కట్టించిన చరిత్ర ఆమె ఫ్యాన్స్ ది.. కాగా ఈమె ఈ మధ్యలో నటించిన తెలుగు సినిమా ఆడవాళ్ళూ మీకు జోహార్లు. ఇందులో రష్మిక తల్లిగా నటించి ఆకట్టుకుంది.

Share post:

Popular