మంచు విష్ణు, నాగచైతన్యకు ఆ విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా ?

ఇండస్ట్రీలో ఒకే సినిమా టైటిల్ కోసం రెండు సినిమాల హీరోలు పోటీలు పెట్టుకోవడం ఇది కొత్తేమి కాదు. ఇది వరకు కూడా ఇలా సినిమాల విషయంలో చాలానే జరిగాయి. ఇక గతంలో మహేష్ బాబు కూడా ఖలేజా సినిమా సమయంలో టైటిల్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక అదే విధంగా హీరో కళ్యాణ్ రామ్ కత్తి సినిమా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హీరో నాని కూడా గ్యాంగ్ లీడర్ వంటి టైటిల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

అయితే ఇటువంటి వివాదాలు కొన్ని మాట్లాడుకోవడం వల్ల సర్దుకుంటాయి. మరికొన్ని మాత్రం వివాదాలు గా మారి కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చాలా ఇబ్బంది అని కొంతమంది టైటిల్ మార్చుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తలనొప్పి మంచు విష్ణు – నాగచైతన్య ల మధ్య వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు ఈషన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు నుంచి టైటిల్ గాలి నాగేశ్వరరావు అని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక మంచు విష్ణు అందుకు సంబంధించి ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇక నాగచైతన్య డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కూడా నాగేశ్వరరావు అనే పేరు పెట్టాలనుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి ముందు వెనక ఎలాంటి పేర్లు లేవు.. దీంతో ఈ టైటిల్ తో మంచు విష్ణు కి పెద్ద తలనొప్పిగా మారుతోంది.

ఇద్దరిలో ఎవరో ఒక్కరైనా సరే టైటిల్ మార్చుకోవడం మంచిది అని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. అయితే నాగచైతన్య నటిస్తున్న సినిమా పేరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందట.. కానీ మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ కన్నా ముందుగా జిన్నా అనే టైటిల్ని అనుకున్నారట. ఒక వేళ మంచు విష్ణు ఈ టైటిల్ కి ఒప్పుకుంటే నాగచైతన్య తన తాతయ్య పేరుతో ఆ సినిమా తీయవచ్చు. లేదంటే మరి ఈ టైటిల్ విషయం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరి.

Share post:

Latest