జ‌గ‌న్ ట్రాప్‌లో బాబు చిక్కారా… !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయ ఎత్తుగ‌డలు.. వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. 2012 నుంచి కూడా ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎత్తుగ‌డ‌ల రాజ‌కీయం కొన‌సాగుతూనే ఉంది. ఒకానొక ద‌శ‌లో అస‌లు వైసీపీని లేకుండా చేసేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని సోనియాతో చేతులు క‌లిపి.. జ‌గ‌న్‌ను జైలుకు పంపించార‌ని.. వైసీపీ నేత‌లు త‌ర‌చుగా చెబుతుంటారు. స‌రే. ఆ ఎత్తుగ‌డ పార‌లేదు.. ఇక‌, ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌కు వ‌చ్చేస‌రికి.. 2012లో తొలిసారి పార్టీ పెట్టుకుని.. ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. ఘ‌న‌విజ‌యంద‌క్కించుకుంది.

అయితే.. 2014కు వ‌చ్చేస‌రికి.. జ‌గ‌న్ వ్యూహాన్ని చిత్తు చేసేలా.. ప్ర‌తివ్యూహం ప‌న్నిన చంద్ర‌బాబు.. విజ యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చారు. అదేస‌మ‌యంలో 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక లోనూ.. త‌ర్వాత కాకినాడ ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకునేలా వ్య‌వ‌హ‌రించారు. దీంతో మ‌ళ్లీ వైసీపీ ఉంటుందా.. ఉండ‌దా.. అనే చ‌ర్చ జోరుగా సాగింది. దీనికితోడు.. వైసీపీ ఎమ్మెల్యేల‌ను.. త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ చంద్ర‌బాబు సక్సెస్ అయ్యారు. ఇక‌, వీట‌న్నింటినీ.. త‌న సుదీర్ఘ పాద‌యాత్ర ద్వారా అడ్డుకున్నారు జ‌గ‌న్‌.

అంతేకాదు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయిం చిన‌.. జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత‌..అ ప్ప‌టి సీఎం చంద్ర‌బాబును డిఫెన్స్‌లో ప‌డేశారు. దీంతో ఆయ‌న జ‌గ‌న్ వ్యూహానికి చిక్కుకుని.. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్నారు. ఇది పెద్ద మైన‌స్ అయింది. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు అధికారం కోల్పోయి.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. పోనీ.. ఇప్పుడైనా.. చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ట్రాప్‌కు దూరంగా ఉన్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఎలాగంటే.. చంద్ర‌బాబు.. వైసీపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా.. బాదుడే బాదుడుకార్య‌క్ర‌మం తీసుకువ‌చ్చారు.

దీనికి కార‌ణం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచిన ధ‌ర‌ల‌పై టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో వైసీపీ నా యకులు.. మీ హ‌యాంలోనే ధ‌రలు పెంచారంటూ.. ఎదురు దాడి చేశారు. ఈ దాడి నుంచి బ‌య‌ట ప‌డేం దుకు.. టీడీపీ బాదుడే బాదుడు తీసుకువ‌చ్చింది. ఇక‌, ఇదిలావుంటే.. టీడీపీ వ్యూహానికి క‌ళ్లెం వేసేలా.. వైసీపీ.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం తెచ్చింది. దీంతో వైసీపీ ఎక్క‌డ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుంద‌ని అనుకున్నారో.. ఏమో చంద్ర‌బాబు వెంట‌నే.. ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం తెచ్చారు. దీంతో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం సైడ్ అయిపోయింది.

అంతేకాదు.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లకు సంక్షేమ ప‌థ‌కాల‌పై క‌ర‌ప‌త్రాలు పంచుతున్నారు. టీడీపీ ఇలా చేయ‌డం లేదు. ఎందుకంటే.. సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో ల‌బ్ధిని వైసీపీ చూపించిన‌ట్టు చూపించాలి(ఉదాహ‌ర‌ణ‌కు అమ్మ ఒడి 15000). కానీ,.. టీడీపీకి ఆ మేర‌కు ఉన్న ప‌థ‌కాలు లేవు. విదేశీ విద్య వంటివి ఉన్నా.. అవి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి.. కొంత మేర‌కు స‌బ్జిడి ఇచ్చారు. త‌ప్ప‌.. ప్ర‌త్యేకంగా వేల‌కు వేలు.. ప్ర‌జ‌ల‌కు చేకూర్చిన ల‌బ్ధి లేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఇప్పుడు బేల చూపులు చూసే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ఇలా.. జ‌గ‌న్ ట్రాప్‌లో చిక్కుకోకుండా.. టీడీపీ సొంత‌గా ఏదైనా చ‌ర్య‌లు చేప‌డితే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.