“గోయింగ్‌ మ్యాడ్‌” సమంత పాట పై బాలీవుడ్ హీరో సంచలన కామెంట్స్..నెట్టింట వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ..తన కెరీర్ లో భిన్న విభిన్న పాత్రలు చేస్తూ..అభిమానులను మెప్పించింది. పెళ్లికి ముందు..పెళ్లి తరువాత..తన హద్దులో ఉంటూనే కుర్రాళ్లకు మతులు పొగొట్టింది. అమ్మడు చీర కడితే..కుందనపు బొమ్మలా..మోడ్రెన్ డ్రెస్ వేస్తే హాట్ బాంబ్ లా కనిపిస్తుంది అంటారు అభిమానులు. ఇక విడాకుల తరువాత పూర్తి గా మారిపోయిన సమంత..తన నచ్చిన సినిమా లు ఓకే చేస్తుంది. ఇష్టం ఉన్న బట్టలు వేసుకుంటుంది. నా లైఫ్ నా ఇష్టం అన్న రీతిలో ముందుకెళ్తుంది సమంత. అలానే కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది.

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన..”పుష్ప” సినిమాలో..అద్దిరిపోయే ఐటెం సాంగ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట కి చంద్రబోస్ లిరిక్స్ బాగా మ్యాచ్ అయ్యాయి. ఇక సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్ తో సమంత ఎగిరి ఎగిరి డ్యాన్స్ వేస్తుంటే ఉంటుంది చూశారా..ధియేటర్స్ లో జనాలు పూనాకాలు వచ్చిన్నట్లు ఊగిపోయారు. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. బడా స్టార్స్ సైతం సమంత గ్రెస్ ని చూసి షాక్ అయ్యారు. అసలు సమంత ఐటెం సాంగ్ చేయడమే ఓ షాక్ అయ్యితే.. ఇంత హాట్ గా స్టెప్పులు వేసి మెప్పించడం మరో సంచలనంగా మారింది.

అయితే రీసెంట్ గా ఈపాట గురించి పొగుడుతూ బాలీవుడ్ బడా హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సినిమా ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా అయిపోయాదు రణ్‌వీర్‌. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయనను యాంకర్ మీకు తెలుగులో బాగా నచ్చిన పాట ఏది? అని ప్రశ్నించగా… టకున్న రణవీర్ ఆన్సర్ ఇస్తూ.. “సమంత ఐటెం సాంగ్. అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా సాంగ్‌ నాకు చాలా చాలా ఇష్టం. నిజానికి నాకు ఈ పాట్ కి మీనింగ్ తెలియదు. కానీ ఈ పాట విన్నప్పుడు ఐయామ్‌ గోయింగ్‌ మ్యాడ్‌ అన్నట్లు బాడీలో ఛేంజ్స్ వస్తాయి. నా మనసును టచ్ చేసిన పాట అది. అందుకే ఆ పాట నాకు పిచ్చి ఇష్టం” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Latest