“బిగ్ బాస్ సీజన్ 6” లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

తెలుగులో గత అయిదు సంవత్సరాలుగా సీజన్ ల వారీగా వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. దీనికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటి వరకు ఇది 5 సీజన్ లు పూర్తి చేసుకుంది. కాగా ఇది ఈ మధ్యనే ఓటీటీ లోనూ ఎంటర్ అయ్యి మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇందులో మొదటి విన్నర్ గా వర్థమాన నటి బిందు మాధవి విజేతగా నిలిచి తెలుగు బిగ్ బాస్ లో ఏకైక మహిళగా రికార్డు సాధించింది. దానితో ప్రేక్షకులు ప్రతి ఏటా వచ్చే బుల్లితెర బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఐపిఎల్ సందడి మొదలైంది…మరియు ఈ రోజుతో దీనికి కూడా స్వస్తి పలకనున్నారు. మామూలుగా ఐపిఎల్ పూర్తయ్యే సమయానికి బిగ్ బాస్ షో వస్తూ ఉంటుంది. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు పాల్గొన బోతున్నారు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 కు ఒకప్పుడు బుల్లి తెరపై యాంకర్ గా అలరించిన ఉదయభాను, జబర్దస్త్ తో నటుడిగా నిరూపించుకున్న గెటప్ శీను లకు పిలుపు అందిందని తెలుస్తోంది. ఇక యాంకర్ లలో మరొకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది. వాటిలో ప్రత్యూష లేదా రోజాలు ఉన్నారు. ఇటీవల వచ్చిన బిగ్ బాస్ ఒటిటి లో సందడి చేసిన యాంకర్ శివ, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ లు పాల్గొనే ఛాన్స్ ఉన్నాయి. నటుడు అజయ్, కృష్ణ, సింగర్ మామ సింగ్, యూ ట్యూబర్ నిఖిల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి సరికొత్తగా సామాన్యులు కూడా ఇందులో పాల్గొనే అవకాశాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు కల్పిస్తున్నారట. అయితే ప్రస్తుతం సామాన్యుల ను ఎంచుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి సామాన్యుల నుండి ఎవరు బిగ్ బాస్ లో పాల్గొంటారు అనేది తెలియాల్సి ఉంది.

మరి ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నాయి… కాగా ఇదే లిస్ట్ ఫైనల్ అవుతుందా లేదా ఇందులో కూడా మార్పులు జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Popular