బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే మొదటిసారి..సంచలన రికార్డ్..!!

హమ్మయ్య..ఎట్టకేలకు బిగ్ బాస్ OTT ఫైనల్ ఎపిసోడ్ ముగిసింది. అందరు అనుకున్నట్లే ఆడపులి హీరోయిన్ బిందుమాధవి కప్ కొట్టి..విన్నర్ గా నిలిచింది. ఇక బోలెడంత ఆశను పెట్టుకుని..ఈసారైన బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని అనుకున్న అఖిల్ కి రన్నర్ పోజీషన్ నే దక్కింది. దీంతో నెట్టింట పెద్ద ఎత్తునే బిగ్ బాస్ కంటెస్టేంట్ నటరాజ్ మాస్టర్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. హౌస్ లో ఉన్నంత కాలం ఆమె ను టార్గెట్ చేస్తూ..నువ్వు విన్నర్ కి అనర్హురాలివి అంటూ మండిపడేవాడు. దీంతో ఆమె కప్ అందుకుంటే అప్పుడు ఆయన ముఖం చూడాలి అని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ రూపంలో చెప్పుకొచ్చారు.

ఫైనల్ గా బిందు మాధవి..అత్యధికంగా ఓట్లు సంపాదించుకుని..బిగ్ బాస్ OTT విన్నర్ గా నిలిచింది అంతేకాదు. ఇప్పటి వరకు ఎవ్వరు సాధించలేని సంచలన రికార్డ్ ను ఆమె పేరిట నెలకోల్పింది. మనకు తెలిసిందే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా విన్నర్ గా నిలవలేదు. బిగ్ బాస్ సీసజ్ 2 లో గీతా మాధురి, సీజన్ 3 లో శ్రీముఖి.. చాలా ట్రై చేసి రన్నర్ పోజీషన్స్ దక్కించుకున్నారు. కాగా ఇప్పుడు బిందు మాధవి బిగ్ బాస్ OTT మహిళా విన్నర్ గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెను సపోర్ట్ చేసిన వాళ్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా..బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ మొత్తం సందడి సందడి గా మారిపోయింది. స్టేజీ పై నాగార్జున హంగామా..ఎలిమినేట్ అయిన కంటేస్టెంట్స్ లో టెన్షన్..కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనందం..ఇక గెస్ట్ లు గా వచ్చినా స్టార్స్ పర్ ఫామెన్స్లు..అబ్బో అది చెప్పితే అర్ధం అయ్యేది కాదు. అంత బాగా జరిగింది ఫైనల్ ఎపిసోడ్. ఎట్టకెలకు బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయ్యింది. అందాల ముద్దుగుమ్మల డ్యాన్సులు..నాగార్జున నవ్వులతో షో ముందుకు వెళ్లింది. ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అందరు ఎలిమినేట్ అయ్యి..ఫైనల్ గా అఖిల్ -బిందు మిగిలారు. వాళ్లిద్దరిని స్టేజీ పైకి తీసుకొచ్చిన నాగార్జున..బిందుమాధవిని విన్నర్ గా అనౌన్స్ చేసి..ట్రోఫీ..క్యాష్ ప్రైజ్ అందించారు.

Share post:

Popular