టాలీవుడ్ లో తీవ్ర విషాదం..బాలయ్య ”అఖండ” సినిమా నటుడు కన్నుమూత..!!

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు తరువాత ఒకరు మరణిస్తూ..ఆ విషాద వార్తలతో సినీ ఇండస్ట్రీ శోకశంద్రలో మునిగి పోయింది. కొందరు అనారోగ్య కారణాల చేత మరణిస్తుంటే..మరికొందరు వయసు పై పడ్డి ..తనువు చాలిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ఇండియాలో కాళ్ళు మోపినప్పటి నుండి..ఈ మరణ వార్తలు ఎక్కువైయాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి చాలా మంది స్టార్ సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. సినీ ఇండస్ట్రీకి తీరని అన్యాయం చేసింది మాయదారి కరోనా.

ఇక ఈ కరోనా కొంచెం శాంతించ్చింది అనుకుంటే.. హార్ట్ అటాక్ లని, ఫ్యాట్ కరగడానికి సర్జరీలు అని, యాక్సి డేంట్ లని..ఇలా వరుస ప్రమాదాలతో సినీ ప్రముఖు మరణిస్తుండటం బాధాకరం. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్ననే..బుల్లితెర నటి ఫ్యాట్ సర్జరీ కోసం వెళ్లి ఆపరేషన్ మధ్య లో మృతి చెందిన విషయం మరువకముందే..ఇండస్ట్రీని మరో విషాదం వెంటాడింది.

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి (67) గురువారం హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. దీంతో డాక్టర్ సలహా మేరకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో నే అనారోగ్యం తో బాధపడుతూ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కర్ణాటకలోని రాయ్‌చూర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ..అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ శోకశంద్రం లో మునిగిపోయింది. తెలుగు, తమిళ్,కన్నడ భాషాల్లో ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన సీరియల్స్ కూడా నటించారు. సహజంగా నటించి అభిమానులను మెప్పించారు చలపతి చౌదరి. ఇటీవలే విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమలో కూడా ఆయన కీలక పాత్రలో నటించారు. ఆయన మరణవార్త విన్న పలువురు సెలబ్రిటీలు చలపతి చౌదరికి నివాళులు అర్పిస్తున్నారు.

Share post:

Popular