వావ్: ఎన్టీఆర్ సినిమాలో..మహేష్ మరదలు..పిచ్చెక్కిపోవాల్సిందే..?

తెర పై కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. చూడటానికి నిజంగా వాళ్ళు భార్య భర్తలు లా, అన్న చెల్లెలు లా, బావ మరదలు లా..ఉంటారు. ఇక అలాంటి జంటలల్లో మహేష్-సోనాలీ బింద్రే కూడా ఒకరు. వీళ్ళు కలిసి నటించిన మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి..మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. కృష్ణ వంశీ టోటల్ ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మహేస్-సోనాలీ బావ మరదలు గా చేసిన అల్లరి, సరసాలు, అబ్బో అప్పట్లో యువతను బాగా అట్రాక్ట్ చేసింది.

ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో మెప్పించిన సోనాలీ..క్యాన్సర్ తో పోరాడి ..జయించి పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకుని బయటపడింది. ఇప్పుడు సోనాలీ సూపర్ హెల్తీ గా తయారైంది. దీంతో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఈ క్రమంలో నే ఆమెకి కొరటాల శివ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ తారక్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్లనుంది. రీసెంట్ గా ఆచార్య సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ ఫస్ట్ ఫ్లాప్ అందుకున్న కొరటాల..ఈసారి స్క్రిప్ట్ మార్చి..కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తారక్ కు అక్కగా ఈ సినిమాలో సోనాలీ ని అనుకున్నారట. ఇదే విషయమై ఆమెని అప్రోచ్ అవ్వగా..ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయ్యిన్నట్లు సమాచారం. మరి కొన్ని డీటైల్స్ మాట్లాడుకున్న తరువాత..ఈ విషయాని అఫిషియల్ గా ప్రకటిస్తారట. ఇదే కనుక నిజమైతే.. సినిమాకి మరింత హైప్ వచ్చిన్నట్లే. సూపర్ హీరోయిన్ ని తారక్ కు అక్కగా ఇరగదీస్తుంది అనడంలో సందేహం లేదు. దీని బట్టి సినిమాలో ఎమోషన్స్ సీన్స్ కూడా బాగానే ఉంటాయని తెలుస్తుంది. మరి చూడాలి.. ఈసారి అయినా రాజమౌళి సెంటి మెంట్ ను బ్రేక్ చేస్తాడా కొరటాల అనేది..?

Share post:

Popular