స్టార్ బ్యూటీకి షాకిచ్చిన సమంత..సర్వ నాశనం..?

స్టార్ హీరోయిన్ సమంత ..మరో క్రేజీ బ్యూటీకి షాక్ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు . దీంతో ఆ హీరోయిన్ కే కాదు.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. సమంత ఇలాంటి మనిషా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి సమంత చేసిన అంత పెద్ద తప్పు ఏంటో తెలుసా..మాట తప్పడం. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో మూవీ లకు సైన్ చేసుకుంటూ పోతూ..ఆ సినిమాలను సెట్స్ పై చుంచుతుంది. ఇప్పటికే శాకుంతలం ,యశోద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇది కాకుండా అమ్మడు చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమచారం.

కాగా, రీసెంట్ గానే స్టార్ హీరోయిన్ తాప్సీ నిర్మాతగా ఓ సినిమాకు కమిట్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. టాలీవుడ్ ఓ వెలుగు వెలిగిన తాప్సీ బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ మంచి మంచి లేడీ ఓరియంటేడ్ సినిమాలు చేస్తూ..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరి పోయింది. అంతేకాదు..ఓ ప్రోడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే సమంత తో ఓ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకుందట తాప్సి. స్టోరీ విన్న సామ్ కూడా బాగా లైక్ చేసిందట . దీంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్తాది అనుకున్న కధ సడెన్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి.

రెమ్యూనరేషన్ కూడా పెద్దగా పట్టించుకోని సామ్ ఫైనల్ మూమెంట్ లో ఎందుకు హ్యాండ్ ఇచ్చిందా అని ఆరా తీస్తే..సామ్ కు ఫుల్ బిజీ షెడ్యూల్ కారణంగా.. మిగత కమిట్ అయిన సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్ద్యేశంతోనే ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టిందట. వన్స్ ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే..తాప్సీ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే నిర్మాత గా సెటిల్ అవుదాం అనుకుంటున్న తాప్సీ కలల్ని సమంత పరోక్షంగా సర్వ నాశం చేసిందంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి సామ్ దీని పై ఎలా రియాక్ట్ అవుతుందో..?

Share post:

Popular