విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా…!

ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో ఆమె గ‌త మూడు, నాలుగేళ్లుగా వ‌రుస పెట్టి క్రేజీ సినిమాలు చేసుకుంటూ పోతోంది. అయితే ఇటీవ‌ల ఆమె న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ప్ర‌భాస్‌తో పూజా చేసిన రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్‌తో చేసిన బీస్ట్ డిజాస్ట‌ర్‌… ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఆచార్య సినిమా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆచార్య కూడా ప్లాప్ అయ్యింది.

దీంతో ఆమెను ఐరెన్ లెగ్ అని కూడా కొంద‌రు ముద్ర వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె మ‌రో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన‌ట్టు తెలుస్తోంది. ఆమె త‌న నెక్ట్స్ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోవిజయ్ దేవరకొండతో క‌లిసి న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ, ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న జన గణ మనలో విజ‌య్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ఇక పూజా చేతిలో ప్ర‌స్తుతం SSMB 28, కభీ ఈద్ కభీ దీపావళి, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో రెండు హిట్లు ప‌డినా పూజా ను ఎవ్వ‌రూ అందుకోలేరు.

Share post:

Latest