‘ ఆచార్య ‘ సెటిల్మెంట్ లెక్క‌లివే… కొర‌టాల‌కు క‌ళ్లుబైర్లు క‌మ్ముతున్నాయ్‌…!

ఆచార్య అట్ట‌ర్ ప్లాప్ అన్న‌ది డిసైడ్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ ఆది నుంచీ ఆచార్య బాధ్యతలు అన్నీ తనపై వేసుకున్నారు. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ఏదో కొద్దిగా లాభం తీసుకుని సినిమా అంతా కొర‌టాల చేతుల్లో పెట్టేశార‌న్న‌ది ముందు నుంచి ఉన్న గుస‌గుస‌. కొణిదెల‌, మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్లు జ‌స్ట్ పేరు మాత్ర‌మే వేసుకోగా.. లాభ‌న‌ష్టాలు అన్నీ ముందు నుంచే కొర‌టాల చూసుకున్నారు.

అయితే ఇప్పుడు సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో నిరంజ‌న్ రెడ్డి త‌న‌కు వ‌చ్చిన ఆ కొద్దిపాటి లాభం కూడా వ‌దులుకున్నార‌ట‌. ఇక వ‌డ్డీలు కూడా ఆయ‌నే భ‌రించార‌ట‌. ఇక రిలీజ్‌కు ముందే చిరంజీవి త‌న రెమ్యున‌రేష‌న్లో రు. 10 కోట్లు వెన‌క్కు ఇచ్చారు. ఇక ఇప్పుడు బ‌య్య‌ర్ల న‌ష్టాల మాట ఏంటి ? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. కొర‌టాల ఈ బ‌రువు దించుకోవాలంటే క‌నీసం రు. 30 కోట్లు వెన‌క్కు ఇవ్వాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.

ఎన్నాఏల ప‌ద్ధ‌తిలో ఆచార్య‌ను రిలీజ్ చేయ‌డంతో బ‌య్య‌ర్లకు వ‌చ్చిన న‌ష్టంలో ఎంతైనా వెన‌క్కు ఇవ్వాలి. ఇక నైజాంలో ఈ సినిమా కొన్న వ‌రంగ‌ల్ శ్రీనుకు 20 కోట్ల పైనే న‌ష్టం వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌కు కొర‌టాల భారీగా వెన‌క్కు క‌ట్ట‌డంతో పాటు ఇత‌ర హామీలు కూడా ఇచ్చేలా ఒప్పందాలు జ‌రుగుతున్నాయంటున్నారు. ఒక్క నైజాంలోనే రు. 12 – 15 కోట్లు వెన‌క్కు ఇవ్వాల్సి ఉందంటున్నారు.

క‌ర్నాట‌క‌లో రు. 3 కోట్లు వెన‌క్కు ఇవ్వాల‌ట‌. ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఈ లెక్క‌లు అన్ని క‌లుపుకుంటే మొత్తంగా రు. 30 కోట్లు వెన‌క్కు ఇవ్వాల్సి వ‌స్తోంద‌ట‌. సినిమా బిజినెస్ రు. 210 కోట్లు చేశారు. అయితే ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా వ‌చ్చిన మొత్తంతో పాటు కొర‌టాల జీరో రెమ్యున‌రేష‌న్ ఇవ‌న్నీ క‌లుపుకుని వెన‌క్కు ఇస్తార‌ని అంటున్నారు. కొర‌టాల‌కు ఈ లెక్క‌ల‌తో క‌ళ్లుబైర్లు క‌మ్ముతున్నాయ‌ట‌.