షాకింగ్ : రాహుల్ సింప్లిగంజ్, కొణిదెల నిహారిక అరెస్ట్ వెనుక ఏం జరుగుతుంది..?

ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.. అభిమానులందరినీ కూడా షాక్ కి గురి చేస్తోంది.. అది ఏంటో తెలుసా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా కొనసాగుతున్న రాహుల్ సిప్లిగంజ్ ను పోలీసులు అరెస్టు చేశారు అన్న వార్త. అవును మీరు వింటున్నది నిజమే.. రాహుల్ సిప్లిగంజ్ అరెస్టయ్యాడు. అయితే గతంలోనే రాహుల్ సిప్లిగంజ్ పబ్ లో జరిగిన గొడవ విషయం లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడూ. ఏకంగా రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో దాడి జరిగిన ఘటన కొన్నాళ్లపాటు సంచలనంగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా పబ్ లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ను పోలీసులు అరెస్టు చేశారు అన్న వార్త మరింత చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.

బిగ్బాస్ కార్యక్రమంలో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుని ఇక విన్నర్గా టైటిల్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఒక పబ్ పై దాడి నిర్వహించిన పోలీసులు 150 మందిని అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడట. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఇక రాహుల్ సిప్లిగంజ్ తోపాటు ఉప్పల్ అనిల్ కుమార్,నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ ను కూడా సీజ్ చేశారు అనేది తెలుస్తుంది. ఇకపోతే రాహుల్ సిప్లిగూంజ్ తన ఓన్ ఆల్బమ్స్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా పునర్నవి భూపాలం తో లవ్ ట్రాక్ తో మరింత హైలెట్ అయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే రాహుల్ సిప్లిగంజ్ కెరియర్ పుంజుకుంటున్న సమయంలో ఇక ఇలాంటి ఘటన మాత్రం కెరీర్ ను దెబ్బతీసే అవకాశం ఉందని తెలుస్తోంది..

Share post:

Latest