వరుణ్ తేజ్ ‘గని ‘ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
సంగీత దర్శకుడు: థమన్
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
రిలీజ్ డేట్‌: 08 ఏప్రిల్‌, 2020

మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా గని. కొత్త‌ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబి నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి గ‌ని అంచనాలు అందుకుందో ? లేదో ? చూద్దాం.

స్టోరీ :
గని (వరుణ్ తేజ్) తన తల్లి మాధురి (నదియా)కి అనూహ్య కార‌ణాల వ‌ల్ల తాను జీవితంలో ఇక బాక్సింగ్ చేయ‌న‌ని మాట ఇస్తాడు. అయితే బాక్స‌ర్ అయిన త‌న తండ్రి వ‌ల్ల త‌న కుటుంబానికి త‌న‌కు జ‌రిగిన బాధ‌, అవ‌మానాల వ‌ల్ల ఎలాగైనా బాక్స‌ర్ కావాల‌ని గోల్ పెట్టుకుంటాడు. ఈ క్ర‌మంలోనే త‌న త‌ల్లికి తెలియ‌కుండానే సీక్రెట్‌గా ప్రాక్టీస్ చేసే క్ర‌మంలో మాయ ( సాయి మంజ్రేక‌ర్‌) గ‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. అస‌లు గ‌ని త‌ల్లి గనిని ఎందుకు ? బాక్సింగ్ ఆడ‌వ‌ద్ద‌ని చెప్పింది ? ఈశ్వ‌ర్ నాథ్ (జ‌గ‌ప‌తిబాబు)కు గ‌ని తండ్రికి మ‌ధ్య ఉన్న లింక్ ఏంటి ? మ‌రి ఉపేంద్ర‌, సునీల్ శెట్టి పాత్ర‌లు ఏంటి ? అన్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
బాక్స‌ర్‌గా గ‌ని పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్ ఆక‌ట్టుకున్నాడు. త‌న లుక్స్‌తో పాటు సిక్స్ ప్యాక్‌, మూమెంట్స్‌తో సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌గా నిలిచాడు. త‌న జీవితంలో జ‌రిగిన బాధ‌తో చివ‌ర‌కు బాక్సింగ్ ఆడ‌న‌ని త‌ల్లికి మాట ఇచ్చి.. చివ‌ర‌కు అదే బాక్సింగ్‌ను ఆయుధంగా మార్చుకునే క‌థ‌లో బాగా లీన‌మై న‌టించాడు. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు, ల‌వ్ సీన్స్‌, ఇంట‌ర్వెల్ సినిమాకు హైలెట్‌. ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి – వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.

హీరోయిన్ సాయి మంజ్రేకర్ న‌ట‌న కంటే అందంతో ఆక‌ట్టుకునేందుకు ట్రై చేసింది. వ‌రుణ్ తల్లి పాత్ర‌లో న‌దియా ఓకే అనిపించారు. మ‌రీ ఆమె పాత సినిమాల్లోగా ఆమె పాత్ర ఎలివేట్ కాలేదు. కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, నవీన్ చంద్ర లు చాలా బాగా నటించారు. ఇక టెక్నిక‌ల్‌గా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, అల్లు బాబి, సిద్ధు ముద్ద‌ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఇక సినిమాలో స్పోర్ట్స్‌కు సంబంధించి.. ముఖ్యంగా బాక్సింగ్‌ను మెయిన్ పాయింట్‌గా పెట్టుకోవ‌డం వ‌ర‌కు బాగున్నా… ట్రీట్‌మెంట్‌, స్క్రీన్ ప్లే ఏ మాత్రం బాగోదు. సినిమా అంతా ప‌ర‌మ రొటీన్‌గా సాగుతుంది. ఇక బిల్డ‌ప్ సీన్లు మ‌రీ ఓవ‌ర్‌. ఫ‌స్టాఫ్ మ‌రీ బోరింగ్.. చాలా సీన్లు ముందే అర్థ‌మైపోతూ ఉంటాయి. యాక్ష‌న్ సీన్లు కూడా ఏ సీన్‌కు ఆ సీన్‌కు అనుగుణంగా వ‌చ్చిప‌డుతూ ఉంటాయి.

యాక్ష‌న్ సీన్ల కోస‌మే ద‌ర్శ‌కుడు సినిమా లెన్త్ పెంచిన‌ట్టుగా ఉంది. ద‌ర్శ‌కుడు తాను అనుకున్న క‌థ‌ను స్క్రీన్ మీద ఇంట్ర‌స్టింగ్‌గా ప్ర‌జెంట్ చేయ‌లేదు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్ 2 లాంటి సినిమాల త‌ర్వాత వ‌రుణ్ ఓ నాసిర‌కం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

గ‌ని ఫైన‌ల్ పంచ్ : ఇంట్ర‌స్టింగ్ స్టోరీ రొటీన్ ట్రీట్‌మెంట్‌

గ‌ని TJ రేటింగ్‌: 2. 25 / 5