“సీరియల్ హీరో – ఇంటర్నేషనల్ బ్యూటీ” ఇద్దరూ కలిస్తే కేజిఎఫ్ ?

దర్శకుడు అంటే ఒక సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా వెండి తెరపై చూపించే ఒక మార్గదర్శి అని చెప్పాలి. ఎందుకు ఈ మాట వాడాల్సి వస్తోంది అంటే, ఎప్పుడూ తాను ఒక లోకంలో ఉండగా ఒకే లైన్ గుర్తొస్తుంది.. మళ్ళీ ఆ లైన్ ఎక్కడ మర్చిపోతామో అని వెంటనే తన డైరీలో నోట్ చేసుకుంటాడు. ఇక అప్పటి నుండి ఆ చిన్న లైన్ ను తీసుకుని స్టోరీని డెవలప్ చేస్తాడు. దానికి కమర్షియల్ హంగులు దిద్దుతాడు. ఆ కథకు ఆ ప్రాణం పోస్తాడు. ఆ కథలో పాత్రలను ఎవరికీ ఇవ్వాలో హోమ్ వర్క్ చేస్తాడు. ఇలా ప్రతి చిన్న విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఎన్నో రోజుల కఠోర శ్రమ తర్వాత ఒక సినిమాను మన ముందుకు తీసుకు వస్తాడు. అయితే ఈ సినిమా అయినా రెండు లేదా మూడు, మన రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే నాలుగేళ్లు తీశాడు. కానీ ఇప్పుడు వార్తల్లో ఉన్న కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ లాంటి మహా సముద్రాన్ని సినిమాగా మలచడానికి 8 సంవత్సరాలు పట్టిందట.

ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇదే నిజం అని అంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథను ఎనిమిదేళ్ళకు ముందు రెడీ చేసుకుని హీరో యశ్ కు వినిపించాడట. కథను వినగానే యశ్ ఖచ్చితంగా ఎంత సమయం అయినా పర్లేదు చేద్దాం అన్నాడట. అలా ఒక సీరియల్ హీరోగా ఉన్న యశ్ ఈ మహా ప్రాజెక్ట్ లో భాగం అయ్యాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడట. ఇప్పుడు సీరియల్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇక ముందు ముందు ఇతనిపై మరింత బాధ్యత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఈ సినిమా మొదటి చాప్టర్ లో మాస్ లుక్ లో, రౌడీలను చితక్కొడుతూ జులాయిగా తిరిగే రాఖీ బాయ్ లాంటి వాడిని కూడా తన అందంతో కట్టిపడేసింది శ్రీనిధి శెట్టి. ఈమెను చూసిన రాఖీ బాయ్ ఫ్లాట్ అయిపోతాడు. అయితే శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ చాప్టర్ లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇపుడు అందరూ ఈమెను ఎంతగానో పొగుడుతున్నారు… అవకాశాలు కూడా భారీగానే వస్తాయి.

అయితే శ్రీనిధి ఈ సినిమాతో ఇంత ఫేమ్ వచ్చి ఉండొచ్చు కానీ..అనామకురాలు అయితే కాదు అని తెలుస్తోంది. ఈమె ప్రపంచానికి ఆరు సంవత్సరాల ముందు అంటే 2016 లోనే పరిచయం అయిందట. 2016 లో నిర్వహించిన మిస్ ఇండియా ఇంటెర్నేషన్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి ఆ అవార్డును గెలుచుకుంది. దీనితో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసిన శ్రీనిధి శెట్టి ప్రశాంత్ నీల్ లాంటి మంచి డైరెక్టర్ చేతిలో పడింది. దీనితో ఆమె దశ పూర్తిగా మారిపోయింది. అలా ప్రశాంత్ నీల్ ఒక సీరియల్ హీరోను మరియు ఇంటర్నేషనల్ సీలెబ్రిటీని కలిపి ఓకే సినిమాలో కలిపారు. ప్రస్తుతం ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.