“ఆచార్య – ధర్మస్థలి” సెట్ గురించి ప్రత్యేక విషయాలు ?

మెగాస్టార్ సినిమా వస్తోంది అంటే ఇక ప్రేక్షకులకు ఆనందానికి అవధులు ఉండవు. ఆ జీల్ మెగా ఫ్యాన్స్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులు అందరి లోనూ కనిపిస్తుంది. తనయుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ కూడా తండ్రిగా ఉన్న చిరు అంతే జోష్ గా చిత్రాలు చేస్తున్నారు. వయసు అయిదు పదులు దాటినా కళ్ళల్లో పవర్, మాటల్లో రిథమ్, స్టెప్పుల్లో స్పీడ్, యాక్టింగ్ లో స్పెషల్ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు చిరుకి. అందుకే ఈయన సినిమాలకు కూడా అంతే డిమాండ్ కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం ఆచార్య చిత్రంతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు చిరు. ఈ సినిమాలో తనయుడు చెర్రీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు మెగాస్టార్. టాలెంటెడ్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో సరికొత్త పాత్రలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ తేజ్ లు అలరిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబందించి నిర్మించిన సెట్ గురించిన విశేషాలు ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం విదితమే. ఈ సెట్ విశేషాలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ కు చెందిన కోకాపేట ల్యాండ్ వద్ద ఈ ధర్మస్థలి సెట్ ను వేసినట్లు సమాచారం. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ ప్రాంత వాతావరణంలో ఈ సెట్ మరింత అందాన్ని తీసుకొచ్చిందని, చూడడానికి చాలా కనుల విందుగా ఉందని కొనియాడుతున్నారు. ఈ సెట్ విశేషాలు గురించి ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ కొరటాల శివ ఆలోచనలకు తగ్గట్లే సెట్ ను వేషం అని అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు సురేష్. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా బాగా నడుస్తోంది. అందులోనూ సౌత్ ఇండియన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ స్టామినాను చూపెడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

ఇప్పటికే పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు సంచలనం సృష్టించగా ఇపుడు రానున్న ఆచార్య చిత్రం కూడా ఇదే స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఏ స్థాయిలో ఈ మూవీ తన మార్క్ ను కనబరుస్తోంది అన్నది చూడాలి. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అందరిలోనూ కొరటాల శివ పై అంచనాలు ఉండడంతో ఉత్కంఠ తారాస్థాయికి పెరుగుతోంది. ఇందులో పూజ హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా నటించడం, ఈ మధ్య పూజ నటించిన సినిమాలు అన్నీ నిరాశ పరుస్తుండడంతో ఒకింత ఆందోళన ఉన్నా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల పై నమ్మకంతో వస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Share post:

Latest