షాకింగ్ ట్వీస్ట్ :నీహారిక డ్రగ్స్ ఇష్యూ పై తమన్నా సంచలన వ్యాఖ్యలు..హీట్ పెంచేసిందిగా..!!

పాపం..మెగాడాటర్ నీహారిక తప్పు చేసిందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి పరువు తీసేస్తున్నారు. పనిలో పని తండ్రి నాగబాబు ని కూడా మధ్యలోకి లాగుతూ..నీహారిక అక్కల పై కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. బంజారాహిల్స్‌ ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో ఆదివారం తెలవారుజామున మూడు గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు సడెన్ షాకిస్తూ..ఆ పబ్ పై రైడ్ చేసారు. పోలీసులకు కూడా దిమ్మ తిరిగిపోయేలా అక్కడ డ్రగ్స్‌ బయటపడటం ఇంకా హా​​ట్‌ టాపిక్ గా మారింది. దీనికి తోడు అక్కడ సినీ-పోలిటికల్ స్టార్స్ పిల్లలు కూడా ఉండటంతో మీడియా మొత్తం వాళ్లపైనే కన్నేసింది.

నిప్పులేనిది పొగ రాదు.. అక్కడ డ్రగ్స్ ఉన్నాయి..పెద్దింటి పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా అందరు డ్రగ్స్ వాడారు అని చెప్పలేం కానీ,,ఎవ్వరో కొందరు మాత్రం తీసుకుని ఉంటారు. లేకపోతేఅక్కడ డ్రగ్స్ ఎందుకుంటాయి. ఇక ఆ బడా పిల్లల లిస్ట్ లో టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు స్వీట్ డాటర్ కూడా ప్రత్యేక్షమైంది. ఇక చూడు మీడియా మొత్తం అమ్మడు ఫోటోలే..మెగా ఫ్యాన్స్ ఏమో నీహారిక తప్పు చేయలేదు అంటుంటే.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వాళ్లు మాత్రం పండగ పూట అర్ధరాత్రి మొగుడిని వదిలేసి పబ్ కు పూజ చేయడానికి వెళ్లిందా మీ ముద్దుల కూతురు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పనిలోపని శ్రీరెడ్డి కూడా ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతూ నాగబాబుని,నీహారికను..మధ్యలో పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టేసింది.

దీంతో ఈ ఇష్యూ మరింత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఇప్పుడు నీహారికను టార్గెట్ చేస్తూ తిట్టేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది తమన్నా సింహాద్రి. ఈ వ్యవహారంపై తాజాగా ట్రాన్స్‌జెండర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ తమన్నా సింహాద్రి స్పందిస్తూ..” ప్రతి ఒక్కరు నీహారిక తప్పు చేసింది అన్నట్లు మాట్లాడుతున్నారు. కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నారు. నీహారిక డ్రగ్స్ తీసుకోలేదు. కేవలం తను తన ఫ్రెండ్ బర్తడే పార్టి కోసం వెళ్లింది. పబ్‌కు వెళ్లినంత మాత్రాన అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నట్లా..? అయినా 150 మంది పట్టుబడితే కేవలం అందరు నీహారికను ఒక్కటే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిహారిక డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. మెగా ఫ్యామిలీని కావాలనే కొందరు టార్గెట్ చేస్తూ ట్రోల్‌ చేయడం దారుణం. అలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అడ్డుకుంటాం.”అంటూ నీహారికకు తన మద్దతు తెలిపింది తమన్నా సింహాద్రి.

Share post:

Popular