ఒకేసారో 10 మంది హీరోయిన్లతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

వాట్.. 10 మంది హీరోయిన్లా..జోక్ చేయకండి..అనుకుంటున్నారా..? నిజమండి బాబు. సినీ ఇండస్ట్రీని నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ..10 మంది హీరోయిన్లను పెట్టి సినిమా తీయ్యబోతున్నాడట. ప్రశాంత్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “అ” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన..మొదటి సినిమాతోనే డిఫరెంట్ గా సినిమాలను డైరెక్ట్ చేస్తారు..అంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయన నుండి వచ్చే రెండో సినిమా ఎలా ఉంటుందా అని అందరు ఎదురుచూడగా..బిస్కెట్ సినిమా తీసి ఉన్న పేరు వెనక్కి నెట్టుకున్నారు.

యాంగ్రీ హీరో రాజశేఖర్ తో “కల్కి” అనే సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కంటెంట్ ఉన్నా కానీ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కొంచెం డిస్సపాయింట్ అయిన ప్రశాంత్ నెక్స్ట్ సినిమాని యంగ్ హీరో తేజ సజ్జా తో ప్లాన్ చేసి.. మళ్లీ ఫాంలోకి వచ్చాడు. “జాంబీ రెడ్డి” అనే సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ ఆ సినిమా ద్వార అభిమానులను కడుపుబ్బ నవ్వించ్చారు. ఈ సినిమా ని విమర్శకులు సైతం ప్రశంసల్లో ముంచెత్తారు. కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తేజ సజ్జా తోనే హనుమాన్ అనే మరో సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్.

ఈ సినిమా ఆల్ మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది చివరిలోనే..సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే, ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ఏకంగా 10 మంది హీరోయిన్లతో ఓ సినిమా తీయ్యబోతున్నాడట ఈ డైరెక్టర్. ఈ సినిమాలో హీరో నే లేకపోవడం మరో స్పెషాలిటీ. సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కునే సమస్యలు..దాని వల్ల వాళ్ళు పడే బాధలు.. ఫైనల్ గా వాళ్ళు ఏం చేశారు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్ సెలక్ట్ అయ్యిన్నట్లు ..తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్‌ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధి​కారిక ప్రకటన వెలువడనుంది.

Share post:

Latest