” ఇండస్ట్రీలో సొంత విమానాలు హీరోలు ..వాటి కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, బన్ని ఏ హీరోలకు లేని ప్రత్యేకత వీళ్ళు మాత్రమే సొంతం చేసుకున్నారు. అయితే ఈ నలుగురు స్టార్ హీరోలకు ఈ హీరోలకు ఓన్‌గా తమకంటూ సొంత విమానాలు ఉన్నాయి. ఇక మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో.. పడవల్లాంటి కార్లలో.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు.. విలువైన గాడ్జెట్స్ వాడుతూ వార్తల్లో హల్ చల్ చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే సొంత విమానులు ఉన్నాయి.

కింగ్ నాగార్జునకి ఓ సొంత ఫ్లైట్ ఉంది నాగ్ తన ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్లడానికి దీనినే ఉపయోగిస్తుంటారు. ఇక ఆ మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొని బిగ్‌బాస్ షూటింగ్‌లో పాల్గొనడానికి ఈ ఫ్లైట్‌నే వాడారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తారు సినిమా కోసం ఇదే ఫ్లైట్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా రూ. 80 కోట్లు ఖర్చు చేసి సొంతంగా ఓ ప్రైవేటు విమానాన్ని కొనుక్కున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా తన ఫ్యామిలీ మెంబర్స్ టూర్స్ కోసం సొంతంగా ఓ విమానాన్ని కొన్నారు. ఇక రీసెంట్‌గా నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు ఈ విమానంలోనే కుటుంబంతో కలిసి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు.. చిరంజీవి ఫ్యామిలీకి కూడా ఓ సొంత విమానం కొన్నారు. ఇక ఈ ప్లైట్‌ను రామ్ చరణ్ దాదాపు రూ. 100 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే గతేడాది చివరలో జరిగిన నిహారిక పెళ్లిలో అతిథుల కోసం ఈ ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు.

అయితే వీళ్లు ఈ జెట్ విమానాలను.. తమకు దగ్గరలో గల ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది దీని మెయింటెన్స్‌తో చూసుకుంటూ ఉంటారంట. ఇక దాని కోసం ఆయా ప్రైవేటు విమానాల యజమానాలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతేకాక.. వేరే వాళ్లకు సైతం ఆయా విమానాశ్రయ సిబ్బంది రెంట్ బేసిస్‌లో ఈ విమానాలు ఇస్తుంటారంట.

Share post:

Latest