ఈ హీరోలు ఏ హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో మీకు తెలుసా..?

ఒక హీరో చిత్రాన్ని మరో హీరో ప్రమోట్ చేయడం , ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేయడం అలాగే ఒక హీరో చిత్రానికి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి సంఘనటనలు ఇప్పటి వరకు చాలా చూశాం. కాగా కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు మరో హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇపుడు అలాంటి కొన్ని సినిమాల్ని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోలను తెలుసుకుందాం పదండి.

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ పలు హీరోల చిత్రాలకు తన వాయిస్ ను అందించారు. యంగ్ హీరో నితిన్ చిత్రం “శ్రీనివాస కళ్యాణం”సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు వెంకీ. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ మూవీ కి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా రవితేజకి బాగా కలిసొచ్చింది. వరుస ఫ్లాప్ లతో నిరాశతో ఉన్న రవితేజ ఈ మూవీతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

మెగా స్టార్ చిరంజీవి సైతం కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెగా మేనల్లుడు అల్లు అర్జున్ వరుడు సినిమాకి, అలాగే దగ్గుబాటి రానా ప్రధాన పాత్ర పోషించిన ఘాజి సినిమాకి, మంచు మనోజ్ మూవీ గుంటూరోడు కి వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరు.

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అప్పుడప్పుడు వాయిస్ ను అరువు ఇస్తుంటారు. అయితే మొట్ట మొదటి సారిగా మహేష్ తన వాయిస్ ను వేరొక హీరో కోసం జల్సా కు ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా మరియు ఇలియానా హీరోయిన్ గా చేశారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఆ తర్వాత మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా చేఇస్నా బాద్షా సినిమాకి తన వాయిస్ ను అందించారు. ఇక తన అక్క మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది మూవీకి కూడా మహేష్ వాయిస్ ఇచ్చారు.

ఇక టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కూడా కొన్ని సినిమాలకు తన వాయిస్ ను ఇచ్చాడని తెలుస్తోంది. అందులో మొదటి సినిమా నాగచైతన్య హీరోగా చేసిన ప్రేమమ్ ఒకటి కావడం విశేషం. తర్వాత తన రెండవ కొడుకు అఖిల్ నటించిన హలో సినిమా కోసం కూడా తన వాయిస్ ను ఇచ్చాడు.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాలకు వాయిస్ ఇచ్చాడు. యంగ్ హీరో రామ్ హీరోగా చేసిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకు తన వాయిస్ ను అందించాడు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అబ్బాయితో అమ్మాయి సినిమాకు తన వాయిస్ ను అందించాడు. ఇందులో నాగసూర్యతో పాటుగా రాజ్ తరుణ్ కూడా నటించాడు. ఇదే కాకుండా నాగశౌర్య హీరోగా నటించిన మరో సినిమా లక్ష్మి రావే మా ఇంటికి కూడా తన వాయిస్ ను అందించి హెల్ప్ చేశాడు.

అలాగే రామ్ కూడా సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా రేయ్ కు తన వాయిస్ ను ఇచ్చాడు. అదే విధంగా నారా రోహిత్ నిఖిల్ హీరోగా చేసిన స్వామి రారాకు మరియు సునీల్… రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాకు మరియు అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలకు తన వాయిస్ ఇవ్వడం జరిగింది.