టాలీవుడ్ కి నాని పరిచయం చేసిన భామలు వీరే..?

కొందరు హీరోలు కొత్త హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ స్పెషల్ గా ఉంటారు. అంతే కాదు కొందరి హీరోలతో చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళుతుంటారు అని సెంటిమెంట్. ఇలాంటి హీరోలలో ఒకరు నటుడు నాని. అనుకున్న లక్ష్యం చేరడానికి అవకాశాల్ని రైడ్ చేస్తూ నేడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. కథల ఎంపికలో జెంటిల్మెన్ అనిపించుకున్న ఈ నటుడు పక్కింటి అబ్బాయి లాంటి సహజమైన నటనతో ప్రేక్షకులతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. సినిమా సినిమాకి వెరియేషన్ చూపిస్తూ ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ అభిమాన గణాన్ని విస్తరించుకున్నారు. ఇలా నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో చాలామంది డెబ్యూ హీరోయిన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వారు ఎవరు ? ఏ పొజిషన్ లో ఉన్నారో ఇపుడు ఓ లుక్కేద్దాం పదండి.

“అష్టా చెమ్మా” చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాని. అలాగే కలర్స్ స్వాతి కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరవాత ఈమె వరుస చిత్రాలతో బిజీ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కెరియర్ మంచి స్పీడ్ పై ఉన్నప్పటికీ ఇటీవలే మళయాళీ పైలెట్ వికాస్ వాసుని వివాహం చేసుకుని ఇండోనేషియా లో సెటిల్ అయ్యారు.

నాని హీరోగా చేసిన “అలా మొదలైంది” సినిమాతోనే హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది నిత్య మీనన్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తరువాత నిత్య మీనన్ కూడా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇప్పటికీ నటిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ తో మరోసారి అలరించింది ఈ అందాల తార.

నాని ప్రధాన పాత్ర పోషించిన “భీమిలి కబడ్డీ జట్టు” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నటి శరణ్య మోహన్. ఈ సినిమా కూడా సక్సెస్ ను అందుకుంది. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు నటి శరణ్య.

నాని “జెంటిల్మెన్” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు నివేథా థామస్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత క్రేజీ హీరోయిన్ గా నివేధా వరుస అవకాశాలు అందుకున్నారు.

నాని నటించిన “ఎవడే సుబ్రహ్మణ్యం” చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు మాళవిక నాయర్. ఆ తరువాత కూడా ఈమె మూవీస్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

“కృష్ణ గాడి వీర ప్రేమగాధ” చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది.

నాని హీరోగా చేసిన మజ్ను చిత్రంతో హీరోయిన్ లుగా పరిచయమయ్యారు అనూ ఇమ్మానుయేల్ మరియు రియా సుమన్.

గ్యాంగ్ లీడర్ చిత్రంతో ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.

నాని ప్రధాన పాత్ర పోషించిన జెర్సీ సినిమాలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమా అయితే ఘన విజయాన్ని అందుకుంది. కానీ శ్రద్ధకు మాత్రం ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ సినిమాకి ముందే ఈమె తమిళ్, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.

ఇక నాని తాజా చిత్రం “అంటే సుందరానికి” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు హీరోయిన్ నజ్రియా నజీం. తమిళ్ డబ్బింగ్ మూవీ “రాజు రాణి” సినిమాతో తెలుగులోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇపుడు నాని సినిమాతో నేరుగా టాలీవుడ్ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ భామ.

Share post:

Latest