విడాకుల వరకు వెళ్లి.. మళ్లీ కలిసి ఉంటున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే?

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక యువతులు అయితే కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతు ఉంటారు. కానీ సిని నటులు జీవితంలో పెళ్లి ఒక సాదాసీదా అంశంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఒకటైన వారు ఇక చిన్న చిన్న మనస్పర్థలకు విడాకులు తీసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడే కాదు ఎన్నో రోజుల నుంచి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితేఇలా పెళ్లి చేసుకుని ఇక చివరికి మనస్పర్థల తో విడాకుల వరకూ వెళ్ళి.. మళ్లీ ఇక ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగి పోయి ఒక్కటైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..

మహేష్ బాబు – నమ్రత : ఏం మాట్లాడుతున్నారు భయ్యా.. మహేష్ బాబు నమ్రత అన్యోన్య దాంపత్యానికి కేరాఫ్ అడ్రస్.. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానం చూపించుకుంటూ ఉంటారు. అలాంటి నమ్రత మహేష్ బాబు విడిపోవడం ఏంటి.. విడాకులు తీసుకోవడానికి సిద్ధం కావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. వీరి గురించి చెబితే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ వీరు జీవితంలో జరిగిన కొన్ని ఘటనల గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. మహేష్ బాబు నమ్రత కు గౌతమ్ పుట్టిన తర్వాత కొన్ని మనస్పర్థల తో ఇక విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక సారి వీరిద్దరూ కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం తో ఇక వీరి మధ్య మనస్పర్థలు తొలగి పోయాయట. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎవర్గ్రీన్ జంటగా కొనసాగుతుంది మహేష్ బాబు నమ్రత జంట.

హీరోయిన్ రంభ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంభ అసలు పేరు విజయలక్ష్మి. మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన రంభ ఆ తర్వాత తెలుగు లోకి అడుగు పెట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించి తెలుగు తెరకు పరిచయమైంది. తరువాత గ్లామర్ బ్యూటీ గా తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత రజినీకాంత్ కమల్ విజయ్ అజిత్ లాంటి పెద్ద హీరోలందరి సరసన నటించింది. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ లాంటి వారితో కూడా ఆడిపాడింది. హిట్లర్, బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, మెకానిక్ మామయ్య లాంటి బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంది.

2010లో కెనడాకు చెందిన ఇద్రన్ పద్మ నాదన్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ భర్తతో విడాకులకు సిద్ధమైంది రంభ. నెలకి రెండున్నర లక్షలు భరణం కూడా కావాలంటూ కోర్టులో కేసు వేసింది. కానీ ఆ తర్వాత ఓసారి భర్తతో మనసు విప్పి మాట్లాడటంతో ఇక వీరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయి. దీంతో కేసు రిటర్న్ తీసుకుని భర్తతో కలిసి ఉంటుంది.

పృథ్వీరాజ్ : 30 ఇయర్స్ పృథ్వి జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది. కోర్టు వీడికి విడాకులు కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలోనే భరణంగా ప్రతి నెల 8 లక్షల రూపాయలు చెల్లించాలి విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. పృథ్వీరాజ్ విజయవాడకు చెందిన శ్రీ లక్ష్మినీ పెళ్లి చేసుకున్నారు. 1984లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసింది. విడాకులు కూడా మంజూరు అయ్యాయి. అయినప్పటికీ ఇక పిల్లల కోసం ఆ తర్వాత శ్రీ లక్ష్మి పృథ్వీరాజ్ కలిసి జీవిస్తున్నారు..

Share post:

Latest