యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. హీరోయిన్ గా మారి సత్తా చాటిన ముద్దుగుమ్మలు వీళ్ళే?

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్లుగా రాణించి తర్వాత కాలం కలిసి రావడంతో హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. యాంకర్లుగా తన వాక్చాతుర్యంతో అలరించిన వారే ఇక ఆ తర్వాత హీరోయిన్లు కూడా తన అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకున్నారు. అలాంటి లిస్ట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సుమ కనకాల : కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ కనకాల. నిజానికి సుమ కెరీర్ స్టార్ట్ అయింది సినిమాలతోనే. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి యాంకరింగ్ చేసింది. ఇప్పుడు 46 ఏళ్ల వయసులో హీరోయిన్ గా అవతారమెత్తి జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటిస్తోంది.

రష్మి గౌతమ్ : జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా అందం అభినయంతో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గుంటూరు టాకీస్ అనే సినిమాతో హీరోయిన్గా అవసరమెత్తింది. తన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ లో ఒక ఐటెం సాంగ్ చేస్తోంది.

అనసూయ భరద్వాజ్ : మొదట న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ యాంకరింగ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. కేవలం బుల్లి తెరతో సరిపెట్టుకోకుండా అటు వెండి తెరపై కూడా ఎన్నో సినిమాలు చేసి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

శ్రీముఖి : తెలుగు బుల్లితెరపై బాగా పాపులర్ అయిన యాంకర్ ల లో శ్రీముఖి కూడా ఒకరు. తన వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ అమ్మడు. మొన్నటి వరకు కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలం నుంచి మాత్రమే హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంటుంది.

కలర్స్ స్వాతి : మొదట బుల్లితెరపై కలర్స్ అనే కార్యక్రమాల్లో యాంకర్గా అవతారమెత్తిన స్వాతి తర్వాత అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది.

రెజినా : టాలీవుడ్ హాట్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకున్న రెజినా కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం యాంకర్ గానే అని చెప్పాలి. ప్రముఖ ఛానల్లో ఒకప్పుడు మంచి యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది.

నిహారిక కొణిదెల : మెగా డాటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక గా మొదట తన కెరీర్ను యాంకర్గానే స్టార్ట్ చేసింది. ఢీ షోతో పాటు మరికొన్ని షోస్ కూడా చేసింది.ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది.

ఇక వీరితో పాటు బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న విష్ణు ప్రియ యాంకరింగ్ లో ఎంతో సెన్సేషన్ సృష్టించిన ఉదయభాను లాంటి వాళ్ళు కూడా కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకున్నారు.

Share post:

Latest