రౌడీ స్టార్‌తో రెచ్చిపోనున్న సమంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే శాకుంతలం, యశోద వంటి పాన్ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ.. తమిళ, హిందీ భాషల్లోనూ పలు క్రేజీ సినిమాలు చేస్తోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఈ భామ.

అయితే తాజాగా మరోసారి రెచ్చిపోయేందుకు రెడీ అవుతోంది సమంత. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఘాటైన రొమాన్స్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ నెల 21న అఫీషియల్‌గా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెల 23 నుండి కశ్మీర్‌లో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసేందుకు సమంత హద్దులు కూడా దాటనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘ఖుషీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ, సమంత జోడీగా మహానటి చిత్రంలో కనిపించారు. అయితే ఆ సినిమాలో వీరిది లీడ్ పెయిర్ కాపోవడంతో ఈసారి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.

Share post:

Latest