మార్కెట్ పెంచుకోడానికి ప్రభాస్ న్యూ ప్లాన్..వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రభాస్… బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యప్తంగా తెలిసేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఈయన సినిమాల్లో నటించినా..ఈ రేంజ్ పాపులారిటీ మాత్రం తెచ్చుకుంది బాహుబలి సినిమాతోనే అని చెప్పక తప్పదు. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఈ సినిమా తరువాత ఆయనకు ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడలేదు.

పేరు కు పాన్ ఇండియా హీరో గా స్టేటస్ సంపాదించుకున్న కానీ..అప్పుడేప్పుడో వచ్చిన సాహో..నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ కూదా..బాక్స్ ఆఫిస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. సినిమా లు ఫ్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. బడా బడా నిర్మాతలు డైరెక్టర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకోస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన మార్కెట్ ను ఇంకా పెంచుకోవడానికి..ఫ్లప్ సినిమాల నుండి తప్పించుకోవడానికి..ప్లాన్ బీ స్టార్ట్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మారుతున్న కాలానికి ట్రెండ్ సెట్ ని ఫాలో అవుతూ.. తాను కూడా ఇక పై మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకుంటున్న ఈ హీరో.. ఇక పై మలిటీ స్టారర్ కధలే వినాలని ఫిక్స్ అయ్యారట, ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నారట. ప్రభాస్ తీసుకున్న నిర్ణయం బాగుంది కానీ, అన్ని వేళ్లల అది పనికిరాదు.. కేవలం రెండు మూడు సినిమాలకే అది వర్క్ అవుట్ అవుతుందని సిని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ప్రభాస్ చేతిల్లో ఇప్పటికే ఐదు పాన్ ఇండియా సినిమాలు రెడీగా ఉన్నాయి.

Share post:

Popular