అయ్యయ్యయో..ఎంత కష్టమోచ్చింది పవన్ నీకు..ఇరుక్కుపోయావు కదా సామీ..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలు జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు. ఆ పేరుకు ఉన్న పవర అలాంటిది ఏం చేద్దాం..ఆయన మాటే శాసనం ..ఆయన చూపే ఆశీర్వదం అనుకుంటారు పవన్ ప్యాన్స్. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఆయనని దేవుడి గా పూజిస్తారు. ఇలాంటి అభిమానం అందుకోవడం చాలా రేర్..అప్పట్లో నందమూరి తారకరామారావు గారు..ఇప్పుడు అంతటి అభిమానాని అందుకుంటున్న వ్యక్తి పవన్ కల్యాన్ అని ప్రముఖులు సైతం అంటున్నారు.

రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న పవన్..ఆ తరువాత వరుస ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టి బిజీ బిజీ గా ఉన్నాడు. డైరెక్టర్ క్రిష్ తో..హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా .. ఆ త‌ర్వాత పవన్ లక్కి డైరెక్టర్ హరీష్ శంకర్ తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా చేయాలి. ఇక ఆ తరువాత సురేందర్ రెడ్డి తో ఓ సినిమా కు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇక ఈ మధ్యనే వినోదియ సిత్తం అనే త‌మిళ సినిమా రీమేక్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు కూడా వైరల్ అయ్యాయి.

నిజానికి ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేయాలంటే కష్టం. ఒకప్పుడు పవన్ నాలుగు ఐదు సినిమాలు షూటింగ్ లు చేసి ఉండచ్చు . కానీ, అప్పుడు పవన్ వేరు ఇప్పుడు పవన్ వేరు. అప్పుడు..సినిమాల పై మాత్రమే పవన్ ఫోకస్ ఉండేది..కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా బిజీ గా మారాడు..ఓ వైపు సినిమాలు మరోవైపు ప్రజా సేవా రెండింటిని సరిసమానం గా మ్యానేజ్ చేయడం చాలా కష్టం. కానీ పవన్ ఎలాగోలా నెట్టుకోస్తున్నాడు. అయితే, ఇప్పుడు పవన్ కి పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. 2024 లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి..దాని పై పవన్ ఫోకస్ చేయాలంటే ఇప్పటి నుండే పక్క ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి. కానీ పవన్ చేతిలో బోలెడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు..ఇప్పుడు సినిమా షూటింగ్ లంటూ తిరిగితే పవన్ విలువైన సమయం వృధా అయ్యిన్నట్లే..అలా అని నమ్మి సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ని వదులుకోలేడు..ఈ రెండింటి లో పవన్ దేనికి సరైన న్యాయం చేయాలో సతమతమౌతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి పవన్ సినిమాలకి ఓటు వేస్తారా..లేక తనకు ఓటు వేసే జనాలకోసం సినిమా లనే వదులుకుంటాడా..?