మెగాస్టార్ “ఆచార్య” లీక్ అయిన కథ నిజమా?

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఆ తర్వాత సినిమాల నుండి తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్ళాడు. అయితే పరిశ్రమలో ఇంకా కొనసాగాలి అని ప్రేక్షకులు కోరుకోవడంతో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నది. తాజాగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ నెల లోనే విడుదల కాబోతోంది. ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ లుగా కాజల్ అగర్వాల్ మరియు పూజ హెగ్డే లు నటించారు. సామజిక విలువలను జోడించి సినిమాలను తెరకెక్కించగల సామర్ధ్యం ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను సృష్టించాడు. అయితే ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ లీక్ అయింది అంటూ లీక్ రాయుళ్లు ట్రైలర్, టీజర్ మరియు పోస్టర్ లను బట్టి తమకు తోచిన కథలను అల్లుతూ ఇదే అసలు కథ అంటూ బొంకుతున్నారు. అయితే సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమా కథ మనకు తెలిసే అవకాశం లేదు. అయితే అప్పటి వరకు వీరు సృష్టించిన కథ ఏమిటో ఒకసారి చూద్దాం. అయితే కథలోకి వెళితే, ధర్మస్థలి అనే ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ప్రేమాభిమాల నడుమ జీవించే ప్రజలు. అయితే ఆ ఊరి చుట్టూ ఉండే భూములలో ఎంతో విలువైన ఖనిజాలు ఉంటాయని ప్రత్యర్థులకు తెలుస్తుంది. అయితే ఆ భూములు అన్నీ ఆ ఊరిలో ఉన్న దేవాలయం పేరిట రాసి ఉంటాయి. దీనితో ఆ ప్రత్యర్థుల కన్ను ఆ ఊరిజనం మీద పడుతుంది, ఎలాగయినా ఆ ఊరిలో ఉన్న జనాన్ని తరిమేసి ఆ భూములను కబ్జా చేయాలని పన్నాగం పన్నుతారు.

అప్పుడే ఆచార్య నక్సలైట్ గా ఉండి, ఆ ఊరిని, భూములను కాపాడాడనికి వస్తాడు. అయితే చిరంజీవికి ఆ ఊరికి సంబంధం ఏమిటి? ఎందుకు ఆ ఊరికి వచ్చాడు? అన్న ప్రశ్నలకు ఫ్లాష్ బ్యాక్ లో సమాధానం దొరుకుతుంది. ఆ ఊరికి చెందిన సిద్ద (రామ్ చరణ్) ఇదే సమస్య నుండి ఊరిని ప్రజలను కాపాడబోయి ప్రత్యర్థుల చేతిలో చనిపోతాడు. అందుకు అతని కోరికగా ఆచార్య ఆ ఊరికి వచ్చి తన ఆశయాన్ని బ్రతికిస్తాడు. ఇది అసలు స్టోరీ… ఇక కథలో భాగంగా కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా మరియు పూజ హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా ఉంటారు. మధ్యలో లవ్ సీన్స్, పాటలు ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇక ఇప్పటి వరకు దర్శకుడిగా వచ్చిన తర్వాత అపజయం అన్నది ఎరుగని వాడిగా కొరటాల శివ ఈ సినిమాను కూడా అద్భుతంగా మలిచాడని తెలుస్తోంది. కొరటాల ప్రతి సినిమాలో ఏదో ఒక సామజిక బాధ్యతను జోడిస్తూ ఉంటాడు. ఇందులో కూడా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ను చెప్పాడు. మనము తెలిసో తెలియకో మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటాము. ఇందులో ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి అన్నది చాలా చక్కగా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇందులో నెగిటివ్ అంశాలు కొన్ని ఉంటాయని చెబుతున్నారు. పూజ హెగ్డే కు వరుసగా పరాజయాలు పలుకరిస్తున్నాయి. ముందుగా రాధే శ్యామ్ ఆ తర్వాత బీస్ట్… ఇప్పుడు ఆచార్య. మరి ఈ సెంటిమెంట్ నిజం అవుతుందా? చూడాలి.

Share post:

Latest