అలా ఎలా శంకరా..? ఆ స్టార్ హీరో ఘాటైన మాటలు..మ్యాటర్ సీరియస్సే..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలతో బడా బడా సినిమాలను తెరకెక్కించి వాళ్ళ కెరీర్ కి చాలా ప్లస్ అయ్యాడు. మనకు రాజమౌళి ఎలాగో..వాళ్లకి శంకర్ అలాగా..ఆయన సినిమా అంటే హీరోలు సైతం ఎగిరి గంతేసేవారు. శంకర్ డైరెక్షన్ లో సినిమా చెయ్యాలంటే ఎక్కడో భీబత్సంగా రాసిపెట్టుండాలి అని అనుకునేవారు. ఆయన సినిమా అంటే కాల్ షీట్లు ఖాళ్లీ చేసుకుని మరీ డేట్స్ అడ్జెస్ట్ చేసేవారు హీరోలు, నటీనటులు. ఇదంతా ఒకప్పుడు సంగతి..

కానీ , ఇప్పుడు శంకర్ కి డిమాండ్ తగ్గిపోయింది. ఆయన సినిమాల కధలు రోటీన్ గా ఉండటం. పదే పదే సీన్స్ రిపీట్ అవుతుండటంతో జనాలు ఆయన సినిమాలని లైక్ చేయడంలేదు. దీంతో శంకర్ తెరకెక్కించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. కాగా, చాలా ఏళ్ల గ్యాప్ తరువాత శంకర్ మన తెలుగు హీరో తో డైరెక్ట్ గా తెలుగు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. RRR సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న చరణ్ ని హీరో గా పెట్టి RC15 అనే సినిమా ను షూట్ చేస్తున్నారు శంకర్. ఈ సినిమాలో హీరోయిన్లు గా అంజలి, కియార అద్వాని నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు.

కాగా, తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని అప్రోచ్ అయితే ..ఆయన మాట్లాడిన తీరు శంకర్ కి హర్టింగ్ గా అనిపించిందట. చరణ్ కు విలన్ గా ఈ సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్‌ని ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. స్టోరీ విన్న ఆయన .. “కధ బాగుంది కానీ.. ప్ర‌స్తుతం నేను ఉన్న పోజీషన్ కి ఇలాంటి విల‌న్ క్యారెక్ట‌ర్‌లు చేస్తే నా ఇమేజ్ ప‌డిపొతుంది ఏమో.. కొంచెమైన ఆలోచించారా.. శంక‌ర్..అంటూ..మీరు రాసిన కధ బాగుంది కానీ మీ కధకు నేను సెట్ అవ్వను..మరోకరిని ట్రై చేసుకోండి అంటూ శంకర్ ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేశాడ‌ట‌. దీంతో శంకర్ ఆయన పై కోపంగా ఉన్నారట. ఆయన కన్నా మంచి యాక్టర్ ను ఈ పాత్రకి సెట్ చేసి హిట్ కొడతా అంటూ ఛాలెంజ్ చేశారట ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో నిజ‌మెంతుందో తెలియాలంటే దీనిపై మేక‌ర్స్ స్పందించే వ‌ర‌కు ఆగాల్సిందే.

Share post:

Popular