మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోకటి ఉంటుందా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అంటే ఇండస్ట్రీలో ఓ మంచు పేరుంది. ఆయన సినిమాలు బాగుంటాయని..ఆయన చాలా పక్కా ప్లానింగ్ తో సినిమాలకు కమిట్ అవుతాడని. ఒక సినిమా తరువాత మరోకటి కమిట్ అవుతూ..అభిమానులకు కావాల్సిన ఎలిమేంట్స్ అన్ని ఉండేలా ప్లాన్ చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్మకం. ప్రస్తుతం మహేష్ బాబు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో మహేష్ ని మనం ఓ రొమాంటిక్ బాయ్ గా చూడబోతున్నాం అంటూ ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.

కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, పాటలు..సినిమా పై అంచనాలను పెంచేశాయి. మహేష్ బాబు మల్లెపూలు ను చూస్తూ చేసే కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేనా ఈ సినిమాకి మరో ప్లస్ కీర్తి అందాలు. తెర పై కీర్తి మహేష్ జోడీ అందరిని అలరిస్తుందని..కళావతి సాంగ్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. టాక్ బట్టి చూస్తే కూడా మహేష్ ఖాతో మరో హిట్ పక్కా అని తెలుస్తుంది.

అయితే, గత కొన్ని రోజులుగా సర్కారు వారి పాట సినిమా గురించి కొన్ని నెగిటీవ్ కామెంట్స్..బాగా వైరల్ గా మారాయి. సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని..మహేష్ విదేశాలకు జంప్ అయ్యాడని.. అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవ్వదు అంటూ వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అలాంటి వారికి సర్కారు వారి పాట సినిమా మేకర్స్ అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే పాట మాత్రమే షూట్ చేయాలి అంటూ క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. దీంతో అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. తారక్, బన్ని,చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరో ల సినిమా లు అన్ని రిలీజ్ అవుతూ రికార్డ్స్ బద్దలు కొడుతుంటే ..మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేశాదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. వేసవి కానుకగా మే 12న ఈ మూవీ గ్రాండ్ గా ధియేటర్స్ లు విడుదల కానుంది. నిజంగానే ఇది అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Share post:

Latest