సీనియర్ నటి ‘నగ్మా’ బండారం ఇపుడు బయట పడింది.. ఏకంగా ఇద్దరి మోసం చేసిందని టాక్?

సీనియర్ మోస్ట్ యాక్టర్ నగ్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అవసరంలేదు. మొదటి సినిమా అయినటువంటి ‘ఘరానా మొగుడు’ సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో తన పేరుని సుస్థిరం చేసుకున్న నటి నగ్మా. ఆ సినిమా తరువాత నగ్మా తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఈ క్రమంలో పలు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక అప్పటి స్టార్ హీరోయిన్లలో తాను ఒకటి గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ వెలుగు వెలిగింది.

నగ్మా ప్రేమాయణం:
గ్మా కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న తరుణంలోనే అప్పటి కొలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి శరత్ కుమార్ తో రిలేషన్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేసేవి. ఇక వాళ్ల రిలేషన్ బాగా సాగుతోంది అన్న తరుణంలోనే నగ్మా శరత్ కుమార్ ను విడిచి పెట్టిందట. ఆ బాధను తట్టుకోలేక శరత్ కుమార్ వేరే స్థాయిలో డిప్రెషన్ కి వెళ్లాడని అప్పట్లో టాక్ నడిచింది. ఈ క్రమంలో చాలా కాలం వరకు సినిమాలకు దూరంగా వున్న శరత్ కెరీర్ పరంగా బాగా వెనకబడ్డాడని కూడా పుకార్లు షికారు చేసేవి.

నగ్మా మరో ప్రేమాయణం:
ఇక ఆ తర్వాత కాలంలో అప్పటికి క్రికెటర్ గా ఓ వెలుగు వెలుగుతున్న సౌరవ్ గంగూలీతో నగ్మ ప్రేమాయణం నెరిపినట్టు వార్తలు వినిపించేవి. అంతేకాకుండా వీరు ఆంధ్రప్రదేశ్ కాణిపాకం ఆలయంలో పూజలు కూడా చేయడం అప్పట్లో హాట్ టాపిక్. ఇక ఈ విషయం తెలిసిన గంగూలీ భార్య నగ్మా కు వార్నింగ్ ఇచ్చిందని, దాంతో వీరి రిలేషన్ కూడా బ్రేక్ అయినట్టు అప్పటి మీడియా కోడై కూసింది. అలా నగ్మా 2 రిలేషన్స్ పెళ్లి పీటలు వరకు రాలేక పోయాయి. ఇక తరువాతి కాలంలో నగ్మ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం నగ్మ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న విషయం విదితమే.

Share post:

Popular