లడ్డూ కావాలా నాయన..బండ్లన్న భళే ఇరుకున్నాడే..!!

సాధారణంగా మనం తిరుముల కి వెళ్లాము అంటే ఎవ్వరైనా ఫస్ట్ అడిగేది..లడ్డూ నే. అంత బాగుంటాది..ప్లస్ అంతే ఫేమస్. అక్కడ దొరికిన లడ్డూ టేస్ట్ ప్రపంచంలో మరెక్కడ రాదు..ఉండదు..అది నిజం అన్న విషయం మనకు తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు..స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డూ అంటే పడి చచ్చిపోతారు. కాగా, రీసెంట్ గా తిరుముల శ్రీవారిని దర్శించుకున్నాడు కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండన్న..అదే బండ్ల గణేష్.

ఇదో పెద్ద మ్యాటర్ అయితే ఏంటి అనుకోకండి ..పూర్తిగా చదవండి. బండ్ల గణేష్ ఎక్కువుగా శివుడి గుడికే వెళ్తుంటారు అనే పేరుంది టాలీవుడ్ లో. ఫర్ ఛేంజ్ ఈసారి ఇలా తిరుమల వెళ్లి వెంకన్న ను దర్శించుకున్నాడు. ఇక ఇదే విషయాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మధ్య సెలబ్రిటీలు ఏం చేసినా..ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలావాటై పోయింది. ఇక బండ్ల గణేష్ ట్వీట్ కు ఓ నెటిజన్..అమ్మాయి..లడ్డూ కావాలి అంటూ ట్వీట్ చేసింది. జనరల్ గా ఇలాంటివి స్టార్ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు.

కానీ, ఇక్కడ బండ్లన్నా..అమ్మాయి కి రిప్లై ఇచ్చాడు..అలాగే తీసుకొస్తా అంటూ ఆమె కు ఆన్సర్ ఇచ్చాడు. అంతే ఇక చూడండి నెట్టింట బండ్లన్న ను ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. అమ్మాయి అడిగితే తెచ్చిస్తావా,, అబ్బాయిల మెసేజ్లకి రిప్లై ఇవ్వవ్వా..? అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు వల్గర్ మీనింగ్ వచ్చేలా “లడ్డూ కావాలా నాయనా”..అంటూ పరోక్షంగా పరువు తీస్తున్నారు. కానీ, కొందరు నెటిజన్ల కి అర్ధం కానీ విషయం ఏమిటంటే..ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరా..అని ఆరా తీసి ..లడ్డు పంపిస్తాడా..లేదా టైం పాస్ కి వదిలేస్తాడా..ఏమో..ఆ విషయం బండ్ల గణేష్ కే తెలియాలి..?