సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కంగారులో ఫ్యాన్స్ ?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు ప్రేక్షకులను తమ నటనతో అలరించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి మేటి నటులలో ఒకరే ప్రముఖ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఆ కాలంలో చేసిన ప్రతి ఒక్క సినిమా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అల్లూరిసీతారామరాజు సినిమా ఈయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. అయితే వయసు మీద పడడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆ మధ్యన తన సతీమణి విజయ నిర్మల మరణించడంతో ఇంకా కృంగిపోయారు కృష్ణ. దీనితో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.

అయితే ఎంతయినా భార్య మరణించడం ఒక భర్తకు తీరని లోటు అని చెప్పాలి. అలాంటిది ఈ వయసులో ఆయనకు భార్య దూరం కావడం చాలా బాధాకరం. అయినా కృష్ణ ఏంటో దైర్యంగా ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. అయితే తాజాగా ఈయన గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కృష్ణ గారాల కూతురు మంజుల సోషల్ మీడియాలో కృష్ణ ఫోటో ఒకటి అప్ లోడ్ చేసింది. అయితే ఈ ఫోటోను చూసిన కృష్ణ అభిమానులు మరియు ఇతర ప్రేక్షకులు కనగారు పడుతున్నారు. ఏంటీ… కృష్ణ కు ఏమైంది అనారోగ్యమా? అంటూ పలు రకాల కామెంట్స్ వినబడ్డాయి. ఈ ఫోటోలో కృష్ణ మొఖానికి తెల్ల తెల్ల మచ్చలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

అందుకే వీరంతా కంగారు పడిపోయి ఏదో అయిందని ఫీల్ అవుతున్నారు. అయితే ఈ కామెంట్స్ చూసిన మంజుల ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల మేము ఒక పెళ్లికి వెళ్ళాము, అయితే నాన్న వయసు రీత్యా కోవిడ్ ఛాయలు ఇంకా మన చుట్టూ ఉండడంతో ముఖానికి ఇన్విజిబిల్ పేస్ మాస్క్ వేసుకున్నారు. అందుకే ఆ మాస్క్ మీకు ఫొటోలో మచ్చలు ఉన్నట్లుగా కనిపిస్తోంది అని చెప్పింది. ఈ సమాధానం విన్న అందరూ హమ్మయ్య కృష్ణ బాగానే ఉన్నారు అంటూ ఊపిరి పీల్చుకున్నారు. చూశారా అందుకే చూసిందంతా నిజం కాదు. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కామెంట్ చెయ్యాలి, లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయాలి.

Share post:

Latest